న్యూఇయర్‌ వేడుకలకు భారీ ఏర్పాట్లు.. భద్రతతో సంబంధంలేదు..

Published on Tue, 12/31/2024 - 05:29

సాక్షి, అమరావతి: గత కాలపు జ్ఞాపకాలను.. కొత్త ఏడా­దిపై ఆశలను పదిలం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. గడిచిన సంవత్సరంలో ఎదురైన కష్టాలను, కన్నీళ్లను మర్చిపోవాలని, జీవి­తం మళ్లీ నూతనోత్సాహంతో మొదలవ్వాలని ఆకాంక్షిస్తారు. అలాంటి వారికి వారి సంతోషాలను రెట్టింపు చేసుకునేందుకు పలు­వురు ఈవెంట్‌ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. డిసెంబరు 31 రాత్రి జీవితంలో మరిచిపోలేని అనుభూతులను మిగి­ల్చు­కోవాలంటే ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో తాము నిర్వహించే వేడుకల్లో భాగమవ్వాలంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు.  

సామాజిక మాధ్యమాల ద్వారా..
కొద్దిరోజులుగా ఫేస్‌బుక్, వాట్స ప్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నా యి. సినీ తారలు, బుల్లితెర నటులు, యాంకర్లు, స్టేజీ డ్యాన్సర్లు, మ్యూజిక్‌ డైరెక్టర్లు, సింగర్లు వంటి సెలబ్రిటీల ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఎంట్రీ టికెట్‌ ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంటోంది.  ‘డిసెంబర్‌ 31 రాత్రికి మీ ఊరు మేం వస్తున్నాం.. మీరూ రండి..   ఎంజాయ్‌ చేద్దాం.’ అంటూ సెల్ఫీ వీడియాలతో ఆకర్షిస్తున్నారు.

భద్రతతో సంబంధంలేదు..
మరోవైపు.. కొత్త సంవత్సరం పేరుతో మోతాదు మించే ఆనందోత్సాహాలను అదుపుచేయడానికి నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. వేడుకకు వచ్చిన వారుగానీ, అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారు ఏమైపోయినా వారికి సంబంధంలేదని ముందే చెప్పేస్తున్నారు. డబ్బులు దండుకోవడమే పరమావధిగా జరిగే ఇలాంటి హంగామాలకు దూరంగా ఉంటేనే మంచిదని పౌర సమాజం ప్రతినిధులు సూచిస్తున్నారు. దీనికి బదులు ఆధ్యాత్మిక చింతనలో గడపడం, దేవాలయాలకు వెళ్లి భగవంతుణ్ణి దర్శించుకోవడం, మొక్కలు నాటడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, చెడు అలవాట్లను వదిలేయడం, కుటుంబ సభ్యులతో గడపడం, ఇంట్లోనే కేట్‌ కట్‌ చేసుకోవడం వంటివి మరింత సంతోషాని్నస్తాయని వారంటున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)