Breaking News

పచ్చని కాపురంలో చిచ్చురేపిన అనుమానం!

Published on Mon, 01/13/2025 - 12:07

కంభం(ఒంగోలు): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పై అనుమానంతో ఉన్న భర్త దాడి చేసి ఆమెను హత్య చేసిన ఘటన ఆదివారం కంభంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన అర్థవీటి నాగ అంజలి(40)కి 26 సంవత్సరాల క్రితం కంభం పట్టణంలోని సాదుమియా వీధికి చెందిన శివరంగయ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉండగా ముగ్గురికి వివాహాలయ్యాయి. శివరంగయ్య లారీడ్రైవర్‌ గా పనిచేస్తూ చిన్నపాటి ఫైనాన్స్‌ లు నడుపుకుంటుండగా, భార్య పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తోంది. 

ఈ నేపథ్యంలో భార్య, భర్తల మద్య గొడవ జరగగా భార్యను చెక్కతో కొట్టడంతో ఆమె తలకు బలమైన గాయాలై మంచంపై పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ కె.మల్లిఖార్జున, ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు సంఘటన జరిగిన ఇంటి వద్దకు వచ్చి విచారించారు. మార్కాపురం క్లూస్‌ టీమ్‌ బృందం వేలిముద్రలు సేకరించారు. కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అనుమానంతోనే హత్య చేశాడా..:
భార్య, భర్తల మధ్య అప్పుడప్పుడూ చిన్నపాటి గొడవలు జరుగుతుండేవని తెలిసింది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో అల్లుడు తన కుమార్తెతో గొడవపడుతున్నాడని తన మనుమరాలు ఫోన్‌ చేసి చెప్పిందని, తెల్లవారే సరికే ఇలా రక్తపు గాయాలతో చనిపోయి పడి ఉందని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. తన కూతురిపై అనుమానంతోనే అల్లుడు కొట్టి చంపేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల అదుపులో నిందితుడు?
భార్య మృతి చెందిన విషయం తెలుసుకున్న శివరంగయ్య ఆదివారం తెల్లవారుజామునే పోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయినట్లు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)