Breaking News

కట్నం రక్కసికి వివాహిత బలి

Published on Fri, 03/06/2026 - 12:48

విశాఖపట్నం జిల్లా: వరకట్న దాహానికి మరో వివాహిత బలైంది. అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. న్యూపోర్టు పోలీసుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి నాగమణి కుమార్తె రమాదేవిక అలియాస్‌ ప్రత్యూష (23) ప్రస్తుతం బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. 

ప్రత్యూషకు అదే ప్రాంతానికి చెందిన మాద ధనరాజుతో 2022 ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.3లక్షల కట్నం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకోగా, అప్పట్లో రూ.1.50లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ము కోసం భర్తతో పాటు అత్తమామలు కూడా ప్రతి రోజూ ఆమెను వేధిస్తుండేవారు. 

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ప్రత్యూష, ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం ప్రత్యూష మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమార్తె మృతికి అత్తమామల వేధింపులే కారణమని తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ చిట్టిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)