Breaking News

పాముకాటుతో మహిళ మృతి

Published on Tue, 06/03/2025 - 11:38

ఇచ్ఛాపురం టౌన్‌(శ్రీకాకుళం): మున్సిపాలిటీలోని అమీన్‌సాహెబ్‌పేటలో ఆదివారం రాత్రి తలగాన పూజ(27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో తలగాన పూజ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాన పూజ అమీన్‌సాహెబ్‌ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారింటికి వచ్చింది. దీనిలో భాగంగా కుటుంబ సభ్యులతోపాటు అర్థరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. అనంతరం ఇంటికి వెళ్లగా ఉక్కగా ఉండడంతో ఇంటి వరండాలో పడుకున్నారు.

 అయితే ఆ సమయంలో వారి ముగ్గురినీ పాముకాటు వేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండగా మార్గమధ్యలో తలగాన పూజ మృతి చెందినట్లు తెలిపారు. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలకు ఐసీయూ ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతురాలి భర్త తలగాన శంకర్‌ రోజుకూలీ చేస్తూ జీవిస్తుంటారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)