Breaking News

ఎంత పని చేశావు తల్లి!

Published on Tue, 06/10/2025 - 08:24

చాగలమర్రి(నంద్యాల): ఇద్దరు చిన్నారులు.. ఒకరికి నాలుగేళ్లు, మరొకరికి ఏడేళ్లు.. తండ్రి అకాల మరణం చెందారు. ఇక పిల్లల భారమంతా ఆ తల్లిదే. కుమార్తెల ఆలనా..పాలనా చూసుకోవాల్సిన ఆమె మనోవేదనతో తీసుకున్న నిర్ణయం ఇద్దరి పిల్లలను అనాథగా మార్చేసింది. భర్త లేని లోకంలో తాను ఉండలేనంటూ ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో చోటు చేసుకుంది. స్థానిక న్యూ బిల్డింగ్స్‌ కాలనీలోని రోసిరెడ్డి రైస్‌ మిల్‌ వీధిలో నివాసం వుంటున్న పవన్‌ కుమార్‌(40) నిత్యావసర వస్తువుల ఏజెన్సి నిర్వహిస్తూ 40 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని భార్య మహేశ్వరమ్మ(30) ఇద్దరు కుమార్తెలు జాహ్నవి (7), హర్షిత (4)తో కలసి తండ్రి కృష్ణమూర్తి చెంత ఉంటోంది. 

కృష్ణమూర్తికి మతిస్థిమితం లేదు. కొన్నాళ్ల క్రితం అతని భార్య కూడా మృతి చెందింది. మరో వైపు పవన్‌ కుమార్‌ తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. అటు భర్త తరఫు, ఇటు తన తరఫు అండగా నిలవాల్సిన ఎవరూ లేకపోవడంతో భర్త చనిపోయినప్పటి నుంచి మహేశ్వమరమ్మ తీవ్ర ఆందోళన చెందింది. చివరకు మనోవేదనతో ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ గదిలోకి వెళ్లి నిప్పంటించుకుంది. ఇంట్లో మంటలు కనిపించడం, పెద్దగా కేకలు రావడంతో ఇరుగు పొరుగున ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఎస్‌ఐ సురేష్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

ఇంటి లోపల వైపు గడియ పెట్టి ఉండటంతో ఇంటిపై నుంచి పోలీసులు లోపలికి ప్రవేశించి సోఫాలో నిద్రిస్తున్న పిల్లలిద్దరిని, ఆమె తండ్రిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మహేశ్వరమ్మ పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. తల్లి మృతితో రోదిస్తున్న చిన్నారులను చూసి పలువురు కంట తడి పెట్టారు. ప్రస్తుతం దూరపు బంధువు వద్ద ఆ చిన్నారులు ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)