Breaking News

సహజీవనం చేసే వాడే చంపేశాడు

Published on Tue, 04/08/2025 - 06:05

తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్‌గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.

ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు.  ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు. 

ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.  


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)