Breaking News

ఉయ్యాల తాడే.. ఆమెకు ఉరితాడు

Published on Tue, 03/18/2025 - 07:42

కాకినాడ క్రైం: అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన బిడ్డను నిద్రపుచ్చేందుకు కట్టిన ఉయ్యాల తాడుతోనే.. ఆ తల్లి ఉరి వేసుకుని శాశ్వత నిద్రలోకి జారుకుంది. మద్యానికి బానిసైన భర్త వైఖరి.. అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోననే ఆందోళన.. జీవితాన్ని ఎదురొడ్డలేనేమోనన్న నిస్సహాయత వెరసి.. ఎన్నో కలలుగన్న ఆ వివాహిత తన నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించి తనువు చాలించింది. ఎన్నో కలలు చూపించి, ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తకు మద్యం ముందు భార్యాబిడ్డలు ఆనకపోవడంతో.. తమ మరణంతోనైనా భర్తకు కనువిప్పు కలుగుతుందనుకుంటూ తనకు తాను మరణ దండన విధించుకుంది. తన ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను శాశ్వతంగా దూరం చేసి, జీవితాంతం గుండెకోతను మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కొట్టేడు స్వాతి(26)కి 2017లో కాకినాడకు చెందిన తలాటం సురేష్‌తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. కార్‌ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేష్‌ పెళ్లయిన తొలి నాళ్లలో భార్యతో బాగానే ఉండేవాడు. మద్యం అలవాటు శ్రుతి మించడంతో కొంతకాలం తర్వాత భార్యను పట్టించుకోవడం మానేశాడు. వీరికి నాలుగేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. నిత్యం మద్యం మత్తులో జోగుతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అతడి వైఖరితో స్వాతి తీవ్ర అసహనంతో ఉండేది. ఎంత నచ్చజెప్పినా సురేష్‌లో మార్పు రాలేదు. 

స్నేహితులతో కలిసి తాగుబోతులా మారాడని తల్లిదండ్రుల వద్ద స్వాతి బాధపడుతుండేది. ఈ క్రమంలో దంపతుల మధ్య వాదులాటలు జరిగేవి. ఆదివారం అర్థరాత్రి మద్యం తాగొచ్చిన సురేష్‌.. భార్యాపిల్లలు పడుకున్న గదిలో నిద్రపోయాడు. భర్త రాకను స్వాతి గమనించి, ఇంతేనా జీవితం అంటూ ప్రశ్నించింది. దీంతో సురేష్‌ భార్యతో గొడవ పడ్డాడు. ఇలాగే ఉంటే తమ పిల్లల సంగతేంటని ప్రశ్నించడంతో, సురేష్‌ తిరగబడ్డాడు. దీంతో విసుగెత్తిన స్వాతి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. పిల్లల కోసం కట్టిన ఉయ్యాల తాడునే ఉరితాడుగా మార్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరుడు నగేష్‌ ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కిషోర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)