Breaking News

ఆటగదరా శివ!

Published on Wed, 02/26/2025 - 09:55

పలమనేరు: కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందని గుర్తు చేసే ఘటన సోమవారం పలమనేరులో వెలుగు చూసింది. ఓ వివాహిత భర్తను, పిల్లలను కాదనుకుని ప్రియుడితో వెళ్లేందుకు ప్రయత్నించింది. అనూహ్యంగా.. ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపింది. బయటకు వచ్చిన ఆమెను భర్త పెద్ద మనసుతో స్వీకరించాడు. అయితే చిన్నపాటి గొడవకే ఇప్పుడు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. గత ఏడాది.. ఈ ఏడాది.. శివరాత్రి సందర్భంలోనే ఈ ఘటన జరగడం ఇక్కడ గమనార్హం. 

మున్సిపాలిటీ పరిధిలోని బోడిరెడ్డిపల్లికి చెందిన జగన్నాథం భార్య కోమల (36) బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం ఉదయం ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె జల్లిపేట చెరువులో ఆత్మహత్యకు పాల్పడింది.  దీంతో శివరాత్రి పూట ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

గత శివరాత్రి నాడు ఏం జరిగిందంటే... 
గడ్డూరుకు చెందిన కోమలకు జగన్నాథంతో ఏడేళ్ల కిందట వివాహమైంది.  ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. కిందటి ఏడాది.. శివరాత్రి పర్వదినాన జాగరణ పేరిట గుడి వెళ్తున్నానని చెప్పి.. కొలమాసనపల్లికి చెందిన గౌతం(26)తో వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది.  బైక్‌పై గడ్డూరు శివారులోని జగమర్ల అడవి వైపుగా వెళ్లారు. అయితే అప్పటికే జంటలను టార్గెట్‌ చేసే సైకో వినయ్‌ కంట వీళ్లు పడ్డారు.

పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన వినయ్‌.. ఏకాంతం కోసం అడవుల్లోకి, పార్క్‌ల్లోకి వచ్చే జంటను బెదిరించి బంగారం, డబ్బులు, స్మార్ట్‌ఫోన్లు చోరీ చేసేవాడు. అంతటితో ఆగకుండా బ్లాక్‌మెయిల్‌ చేసి అత్యాచారాలు చేసేవాడు. అలా..  ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సైకో వినయ్‌పై కేసులు నమోదయ్యాయి. 

ఈ క్రమంలో.. కోమల, గౌతంలను వినయ్‌ బెదిరించాడు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో రాడుతో దాడికి పాల్పడబోయాడు. అయితే జరిగిన పెనులాగటలో వినయ్‌ కింద పడిపోగా.. గౌతం పక్కనే ఉన్న బండరాయి పడేశాడు. దీంతో వినయ్‌ అక్కడిక్కడే మరణించాడు. ఆపై ఏమీ తెలియనట్లు  గౌతం, కోమల అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత ఈ హత్యోదంతం వెలుగుచూసింది. దీంతో భయపడిన ఇద్దరూ అతన్ని చంపింది తామేనని పోలీసులకు లొంగిపోయారు.

ఇప్పుడేమైందంటే... 
ఆరు నెలల తర్వాత కోమలను ఆమె తల్లిదండ్రులు బెయిల్‌ మీద బయటకు తీసుకొచ్చారు. మళ్లీ తప్పు చేయనని మాట తీసుకుని భర్త ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పటి నుంచి అంతా హాయిగా నడుస్తోంది. ఈ క్రమంలో  చిన్నపాటి గొడవకు తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ప్రాణం తీసుకోవడం ఆ ఇంట విషాదం నింపింది. ఇదంతా ఆ శివుడే ఆడించిన ఆట అంటూ గ్రామస్తులు పలువురు చర్చించుకుంటున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)