Breaking News

అశోక్‌ నన్ను వదిలేయ్‌.. నా బతుకు నేను బతుకుతా..!

Published on Tue, 05/27/2025 - 12:09

మదనపల్లె రూరల్‌(అన్నమయ్య జిల్లా) : భర్త వేధింపులు భరించలేక, క్షణికావేశంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం చింతామణికి చెందిన రాణి(30) భర్తతో విడాకులు తీసుకుని కుమార్తె లేఖన, కుమారుడు సుమిత్‌తో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట సత్యసాయిజిల్లా పాలసముద్రం మండలం బోయలపల్లెకు చెందిన డ్రైవర్‌ అశోక్‌తో రాణికి పరిచయం ఏర్పడి సహజీవనం చేసేంతవరకు వెళ్లింది. అయితే అశోక్‌కు అంతకు మునుపే తంబళ్లపల్లెకు చెందిన మౌనిషాతో వివాహమైంది. 

ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. కొద్దిరోజుల క్రితం అశోక్‌కు ప్రమాదంలో కాలు విరగడంతో రాణి దగ్గరుండి చికిత్స చేయించి, కోలుకున్నాక స్వగ్రామంలో విడిచిపెట్టింది. తల్లిదండ్రుల సూచన మేరకు అశోక్‌తో సహజీవనం వద్దనుకుని బెంగళూరుకు వెళ్లి కూలిపనులు చేసుకుంటోంది. ఈనెల 22న గురువారం అశోక్‌ రాణికి ఫోన్‌చేసి నీతో మాట్లాడాలని కోరడంతో కుమార్తె లేఖనను వెంటతీసుకుని 23 వ తేదీ శుక్రవారం మదనపల్లెకు వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నాక, తమ బంధం కొనసాగింపు విషయమై గొడవపడ్డారు. నీ వేధింపులు నేను భరించలేనంటూ మనస్తాపంతో రాణి కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

దీంతో ఆమె కోసం పట్టణమంతా వెతికి కనిపించకపోవడంతో రాత్రి ఊరికి వెళ్లేందుకు అశోక్‌ ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. బస్టాండ్‌లో రాణి కనిపించడంతో మరోసారి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆవేశంతో రాణి బస్టాండ్‌ వెనుక వైపు ఉన్న కోమటివానిచెరువు కట్ట వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు  యత్నించిన. ప్రమాదంలో ఆమె శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, టూటౌన్‌ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)