Breaking News

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Published on Sat, 11/08/2025 - 11:45

ఎన్టీఆర్‌ జిల్లా: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయనపాడు సమీపంలో శుక్రవారం జరిగింది. గ్రామ సమీంలోని వ్యవసాయ పొలాల్లో కాలిన గాయాలతో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. 

మృతురాలు కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాతుపాటి సాయికుమార్‌ భార్య సాతుపాటి జ్యోతి (20) గా గుర్తించారు. భార్య భర్తల మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భార్య కాలిన గాయాలతో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యా ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తండ్రి మేడా సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)