Breaking News

పోటెత్తిన ‘కృష్ణవేణి’

Published on Tue, 09/30/2025 - 02:37

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/కంకిపాడు/ధవళేశ్వరం/విజయపురిసౌత్‌/మలికిపురం: ప్రకాశం బ్యారే­జ్‌కు ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండ్రోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ఉధృతి అంత­కంతకూ పెరుగుతోంది. అయితే, సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రాత్రి ఏడు గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఒక అడుగు మేర వరద పెరిగింది.

ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దాములూరు, మూలపాడు, కొటికలపూడి, జూపూడి, త్రిలోచనాపురం, లంక గ్రామాల్లో మినుము పంట ముంపునకు గురైంది. 700 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముక్త్యాల–జగ్గయ్యపేట రహ­దారిలో చంద్రమ్మ కయ్య పొంగి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. 

రావిరాల బీసీ కాలనీ వాసులు రెండో రోజు కూడా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. ముక్త్యాల, రావిరాల, కె.అగ్రహారం గ్రామాల్లోని పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద పోటెత్తడంతో భవానీపురం బెరంపార్క్‌లోకి నీరు వచ్చి చేరింది. ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసినప్పటికీ ప్రవాహం ఆగలేదు. దీంతో హరిత బెరంపార్క్‌లోకి పర్యాటకులు, సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు.

ఏటిపాయ ప్రాంతాల్లో వరద ముంపు
కృష్ణాజిల్లాలోని పెనమలూరు, పామర్రు మండలాలు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. తోట్లవల్లూరు, పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. 

అలాగే, దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి కూడా వరద చొచ్చుకొచ్చింది. రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు నివాసాల్లోకి నీరు చేరింది. నివాసితులు సామాన్లను తరలిస్తున్నారు. అలాగే, ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపుబారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

శ్రీశైలం నుంచి 5,91,456 క్యూసెక్కులు విడుదల 
శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 5,91,456 క్యూసెక్కులు వచ్చి చేరటంతో వచ్చిన నీరు వచి్చనట్టు దిగువకు వదులుతున్నారు. సోమవారం 24 క్రస్ట్‌గేట్లు 15 అడుగులు, రెండు గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 5,41,516 క్యూసెక్కులను దిగువకు వదిలారు. కుడికాలువకు 9,533, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 33,333, ఎస్‌ఎల్‌బీసీకి 1,200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నిలకడగా గోదావరి 
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. సోమవారం ఉదయం 6.15 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అదే స్థాయిలో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. 

బ్యారేజీ నుంచి 9,59,784 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కులు వదిలారు. ఎగువన నీటి ఉధృతి పెరుగుతుండటంతో కాటన్‌ బ్యారేజీ వద్ద మంగళవారం వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. 

తీరంలో అలజడి 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం ముందుకు వస్తుండటంతో ప్రజల్లో అలజడి మొదలైంది. అంతర్వేది నుంచి కరవాక వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర సోమవారం సముద్రం 300 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. 

వరద కారణంగా గోదావరి పాయల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో సముద్రం ముందుకొస్తోంది. సముద్రపు అలలు వేగంగా దూసుకురావడం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది. ముఖ్యంగా అంతర్వేది లైట్‌ హౌస్‌ వద్ద తీరం అధికంగా కోతకు గురవుతున్నట్లు కనిపిస్తోంది.  

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)