Breaking News

పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

Published on Sat, 05/20/2023 - 03:44

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): ఖాజీపేట–కొండపల్లి సెక్షన్‌ మధ్యలోని చింతల్‌పల్లి–నెక్కొండ స్టేషన్‌ మధ్యలో జరుగుతున్న మూడోలైన్‌ నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న నాన్‌ ఇంటర్‌లాక్‌ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు పూర్తిగానూ, మరికొన్ని పాక్షికంగానూ రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం  ఓ ప్రకటనలో తెలిపారు. 

పూర్తిగా రద్దు చేసిన రైళ్లు: ఖాజిపేట–డోర్నకల్లు (07753/­07754), విజయవాడ–డోర్నకల్లు (07755/07756), విజయవాడ–గుంటూరు (07464/07465), భద్రాచలంరోడ్డు–సికింద్రాబాద్‌ (17660­/17659), విజయవాడ–సికింద్రాబాద్‌­(12713/­12714) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లును ఈ నెల 21 నుంచి జూన్‌ 7 వరకు పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా ఖాజిపేట–తిరుపతి (17091/17092) రైళ్లు ఈ నెల 23, 30, జూన్‌ 6 తేదీలలో, మచిలీపట్నం–సికింద్రాబాద్‌ (07185/­07186) రైళ్లు ఈ నెల 21, 28, జూన్‌ 4 తేదీలలో రద్దు చేశారు. 

పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు: సిర్‌పూర్‌ టౌన్‌–భద్రాచలం (17034) ఈ నెల 20 నుంచి జూన్‌ 6 వరకు వరంగల్లు–భద్రాచలం మధ్య, భద్రాచలం–సిర్‌పూర్‌ (17033) ఈ నెల 21 నుంచి జూన్‌ 7 వరకు భద్రాచలం–వరంగల్లు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. 

దారి మళ్లింపు:  విశాఖపట్నం–ముంబై ఎల్‌టీటీ (18519) ఈ నెల 21 నుంచి జూన్‌ 7 వరకు వయా విజయవాడ, గుంటూ­రు, పగిడిపల్లి, సికింద్రాబాద్‌ మీదుగా నడుస్తుంది. షాలిమార్‌–సికింద్రాబాద్‌ (22849) ఈ నెల 24, 28, జూన్‌ 4 తేదీలలో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. యశ్వంత్‌పూర్‌–టాటానగర్‌ (18112) ఈ నెల 21, 28, జూన్‌ 4 తేదీలలో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. హైదరాబాద్‌–షాలిమార్‌ (18046) ఈ నెల 28, జూన్‌ 7 తేదీలలో వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్‌ మీదుగా నడుస్తుంది.   

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)