Breaking News

రాజమండ్రి నాగాంజలి కేసు.. ఎన్నో అనుమానాలు?

Published on Sat, 04/05/2025 - 16:39

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్‌లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.

బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని  ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్‌లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్‌తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్‌తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?.  నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్‌ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్‌ 10 ఎంజీ ఇంజక్షన్‌ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది.


 


 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)