Breaking News

జీవోను రాజకీయ కోణంలో చూడకండి

Published on Thu, 01/12/2023 - 04:25

ఏయూ క్యాంపస్‌: ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 1 నిలుస్తుందని పలువురు మేధావులు అభిప్రాయ­పడ్డారు. జీవోను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఎవరి స్వేచ్ఛను ప్రభుత్వం హరించలేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూని­­వర్సిటీలో ఏయూ, విశాఖ నగర మేధావుల వేదిక సంయుక్తంగా బుధవారం ‘ప్రజల ప్రాణా­లకు రక్ష జీవో నంబర్‌ 1’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమా­వేశం నిర్వహించాయి.

ప్రభుత్వం ప్రజల ప్రాణా­లను రక్షించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకు­వచ్చిన జీవో ఇదని వక్తలు స్పష్టం చేశారు. దీన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్య­క్రమంలో న్యాయవాది చిన్నారావు, డాక్టర్‌ ఎ.కె.­ఎం.పవార్, ఆచార్య ఎన్‌.సత్యనారాయణ, డాక్టర్‌ రాజ­మాణి­క్యం, డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, డాక్టర్‌ బాల­కోటయ్య, డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజు, డాక్టర్‌ ఎ.సీతా­రత్నం, డాక్టర్‌ రాజ్‌కుమార్, తదితరులు ప్రసంగించారు.

జీవో నంబర్‌ 1 మన బాధ్య­తను గుర్తు చేసింది. ఈ జీవోతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగదు.
– ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్, అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్, ఏయూ

ప్రజల ప్రాణాలకు నష్టం జరగ­కుండా సమావేశాలు పెట్టుకోవ­చ్చని జీవో స్పష్టం చేస్తోంది. దీన్ని వక్రీకరిస్తూ ఎమర్జెన్సీని తలపి­స్తోందని ప్రచారం చేయడం సరికాదు.
– ఆచార్య కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్‌ కళాశాల

ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవా­లని జీవో స్పష్టం చేస్తోంది. 
– ఆచార్య ఎన్‌.ఎ.డి.పాల్, బీసీడీఈ సమన్వయకర్త

విమర్శించే వ్యక్తులు ముందుగా జీవోను చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. 
– ఆచార్య పి.విశ్వనాథం, గౌరవ ఆచార్యులు, డీసీఎంఎస్‌ విభాగం

ఏయూ మహిళా ఉద్యోగుల సంఘం తరఫున జీవో నంబర్‌ 1ని తాము స్వాగతిస్తున్నాం. ఇటువంటి జీవోలు ప్రజల రక్షణకు, భద్రతకు ఉపయుక్తంగా నిలుస్తాయి.
– ఆచార్య టి.శోభశ్రీ, ప్రిన్సిపాల్, ఐఏఎస్‌ఈ

జీవో నంబర్‌ 1 అప్రజా­స్వామికం అనడం సరికాదు. కందుకూరు, గుంటూరు ఘట­నలు పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఈ జీవో తీసు­కువచ్చారు. 
– ఆచార్య పి.అర్జున్, గౌరవ ఆచార్యులు, సోషల్‌ వర్క్‌ విభాగం

నిషేధం, ఆంక్షలకు వ్యత్యాసం ఉందనే విషయాన్ని గమనించకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈ జీవోపై వాస్తవాలు తెలిపే విధంగా విస్తృత చర్చలు జరపాలి. 
– పాకా సత్యనారాయణ, న్యాయవాది

ప్రజల ప్రాణాలు ఎంతో ప్రధా­నం. ప్రతిపక్షాలు అనవ­సర రా­ద్ధాం­తం చేయడం అర్థర­హితం. 
– ఆచార్య విజయ్‌­మోహన్, డీన్, విద్యార్థి వ్యవహారాలు

కొంత మంది ఏకపక్షంగా ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాట్లాడు­తున్నారు. ఇది సరికాదు. 
– ఆచార్య ఎస్‌.పుల్లారావు, అర్థశాస్త్ర విభాగాధిపతి

అన్ని పార్టీలకు ఈ జీవో వర్తి­స్తుంది, ఎక్కడా నిషేధం లేదు.. కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ సమావేశాలు, ర్యాలీలు జరుపుకోవడానికి ఇబ్బంది ఏముంది?
– ఆచార్య ఎ.పల్లవి, క్రీడా విభాగాధిపతి, ఏయూ 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)