Breaking News

సీజన్‌ వచ్చేసింది.. నోరూరించే రకాలెన్నో!

Published on Mon, 04/20/2026 - 14:45

పిఠాపురం: ఆవకాయ– ఈ మాట వింటే ఎవ్వరికైనా నోరూరిపోతూంటుంది. ముద్దపప్పు అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని, ఆవకాయ నంజుకుని తింటే ఆ రుచికి వేరేదీ సాటి రాదని భోజన ప్రియులు అంటూంటారు. ఆంధ్రాలో పుట్టిన ఈ ఆవకాయ రుచికి తెలుగువాళ్లే కాదు.. ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు సైతం ఫిదా అవుతూంటారు. ప్రస్తుతం సీజన్‌ కావడంతో దాదాపు ప్రతి ఇంటా ఆవకాయల తయారీ ఊపందుకుంటోంది. దీనికి తగినట్టుగానే మార్కెట్లో పచ్చి మామిడికాయల అమ్మకాలు కూడా జోరందుకుంది. అంతేకాదు.. మిరప పంటకు పెట్టింది పేరైన గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఎండు మిర్చి అమ్మకాలు సైతం ఊపందుకున్నాయి. 

ఎన్ని రకాలో.. 
ఆవకాయలో మళ్లీ ఎన్నో రకాలున్నాయి. బెల్లం ఆవకాయ, అల్లం ఆవకాయ, నూపిండి ఆవకాయ, పులిహోర ఆవకాయ, పెసర ఆవకాయ, పచ్చ ఆవకాయ, శనగల ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, ఎండు ఆవకాయ వంటి రకాలున్నాయి. వీటితో పాటు మెంతికాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి (తురుము మాగాయ), ఉడుకు మాగాయ, పిందె మాగాయ వంటి ఊరగాయలను ఎక్కువ మంది పెడుతూంటారు. వీటి కోసం చెరకురసాలు, కొత్తపల్లి కొబ్బరి, కలెక్టర్‌ తదితర అనేక రకాల మామిడి కాయలను ఉపయోగిస్తూంటారు. దీంతో, సీజన్‌ ప్రారంభం నుంచీ వీటికి మంచి గిరాకీ ఉంటుంది. 

ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

విదేశాలకు సైతం.. 
జిల్లావ్యాప్తంగా సుమారు 48 వేల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ప్రస్తుతం చిన్న సైజులో ఉన్న కాయలను రోజువారీ వంటల కోసం విక్రయిస్తున్నారు. ముదిరిన కాయలను ఊరగాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఊరగాయలకు ఉపయోగించే కేజీ పచ్చి మామిడి కాయల ధర రూ.35 నుంచి రూ.45 వరకూ పలుకుతోంది. సైజును బట్టి కేజీకి ఐదారు కాయల వరకూ వస్తాయి. జిల్లావ్యాప్తంగా నిత్యం సుమారు 120 టన్నులకు పైగా మామిడి కాయల అమ్మకాలు జరుగుతున్నాయన్నది అధికారుల అంచనా. మన జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం మామిడి కాయలు ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది 30 శాతం కాయలు శ్రీలంకకు ఎగుమతి అయ్యాయట. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఒమన్, కువైట్, బెల్జియం, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, వియత్నాం తదితర దేశాలున్నాయి. దాదాపు 50కి పైగా దేశాలకు మన ఆవకాయ తదితర ఊరగాయలు సైతం ఎగుమతి అవుతున్నాయి.

సీజన్‌ మొదలైంది 
ఏటా పచ్చళ్లు పెట్టుకునే వారు గతంలో ఇళ్ల వద్దే ముక్కలు కోసుకునే వారు. కోత సరిగ్గా లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. అందుకే మా దగ్గర ముక్కలు కొట్టిస్తున్నారు. మామిడి కాయల సీజన్‌ వచ్చిందంటే మాకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి రోజూ వెయ్యికి పైగా మామిడి కాయలను ముక్కలుగా కొడుతూంటాం. మామూలు రోజుల్లో వెదురు బుట్టలు అల్లుకునే మాకు ఈ సీజన్‌లో మామిడి కాయలు కొట్టే పనే పొట్ట నింపుతుంది. – పిల్లి లక్ష్మి, పిఠాపురం 

ఇక నుంచి ఖాళీ ఉండదు
వారం రోజులుగా మామిడి కాయ ముక్కలు కోయడం ప్రారంభమైంది. మామిడి పండ్లు వచ్చేంత వరకూ రోజూ ఈ పని ఉంటుంది. మాతో పాటు చాలా మంది ముక్కలు కోసే పనిలో ఉన్నారు. ప్రత్యేకమైన కత్తులతో ఎక్కడా ముక్క దెబ్బ తినకుండా, పీచు విడిపోకుండా కోయాల్సి ఉంటుంది. ఈ పని మాకు అలవాటు కాబట్టి మా దగ్గర కోయించుకుంటారు.  – పిల్లి అప్పయ్యమ్మ, పిఠాపురం

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)