Breaking News

భూసమీకరణ కింద భూములివ్వాలని వేధిస్తున్నారు

Published on Sat, 09/13/2025 - 05:27

సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో చట్టబద్ధంగా తమకు హక్కులు ఉన్న భూమిని జీవీ ఎస్టేట్స్‌ అండ్‌ హాస్టల్స్‌ సంస్థకు కేటాయించి.. ఆ భూమిని ఖాళీచేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ నేరుగా తమను బెదిరించారని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు శుక్రవారం మందడం గ్రామ రైతులు పసుపులేటి జమలయ్య, కలపాల శరత్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. భూసమీకరణ కింద తాము భూములు ఇవ్వలేదని చెప్పినా.. ఈ నెల 5న యంత్రాలతో దౌర్జన్యంగా కంచె (ఫెన్సింగ్‌)ను తొలగించి భూముల్లోకి ప్రవేశించి, లాక్కోవడానికి ప్రయత్నించారని తెలిపారు. 

అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా అందజేశారు. ఈ దౌర్జన్యంపై ఈ నెల 9న తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసేందుకు ఆ అధికారి విముఖత వ్యక్తం చేస్తూ, భూసమీకరణ కింద మీ భూములను ఇవ్వాల్సిందేనని ఆదేశించారని చెప్పా­రు. ఏడీబీ సేఫ్‌గార్డ్‌ పాలసీ స్టేట్‌మెంట్‌ (ఎస్‌పీఎస్‌ 2009), వరల్డ్‌బ్యాంక్‌ ఎన్విరాన్‌మెంట్‌ సోషల్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఈఎస్‌ఎఫ్‌ 2018) ప్రకారం బలవంతంగా భూములు తీసుకోకూడదని, సీఆర్‌డీఏ అధికారులు వాటిని ఉల్లంఘించి తమ హక్కులను కాలరాస్తున్నారని వివరించారు. 

ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకుని తమ హక్కులు పరరిక్షించాలని వారు కోరారు. తుళ్లూరు మండలం మందడంలో సర్వే నంబరు 225/1లో పసుపులేటి జమలయ్యకు 0.40 ఎకరాలు, సర్వే నంబరు 225/1లో కలపాల శరత్‌కుమార్‌కు 0.30 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తాము భూసమీకరణ కింద సీఆర్‌డీఏకి ఇవ్వలేదని వారు చెప్పారు.  

అప్పట్లో పంటలు తగులబెట్టారు  
రాజధానికి భూసమీకరణ కింద భూములు ఇవ్వని గ్రామాల్లో 2014 డిసెంబర్‌లో జరిగిన దౌర్జన్యాలు, దాష్టీకాలను ఏడీబీ, ప్రపంచబ్యాంకు దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. అప్పట్లో ఆరు గ్రామాల్లో అరటి పంటను రైతులు సాగుచేసేవారని.. ఆ భూములను భూసమీకరణ కింద రాజధానికి ఇచ్చేందుకు రైతులు నిరాకరించారని తెలిపారు. భూములు ఇచ్చేందుకు అంగీకరించని రైతులను బెదిరించారని, సాగుచేసిన పంటలకు నిప్పుపెట్టి కాల్చేశారని చెప్పారు. 

ఇప్పుడు భూములు ఇచ్చేందుకు అంగీకరించని తమపైన కూడా అదేరీతిలో దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఈ దౌర్జన్యకాండపై ఈనెల 10న సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, అడిషనల్‌ కమిషనర్, డిప్యూటీ కలెక్టర్, డీజీపీ, ఎస్పీ, డీఎస్పీ, ఏడీసీఎల్‌ చైర్‌పర్సన్, గుంటూరు జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, తుళ్లూరు ఎస్‌ఐ, సీఐ, హోంమంత్రి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)