చేబదుళ్లకూ భారీగా వడ్డీ చెల్లింపు

Published on Sat, 03/07/2026 - 04:30

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆర్థిక ఆరాచకం సృష్టించారు. ఏడాదిలో 365 రోజుల్లో 357 రోజులు చేబదుళ్లతోనే ఆర్థిక నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. పైగా చేబ­దుళ్లకు కూడా భారీగా వడ్డీలు చెల్లించిందని వెల్లడించింది. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు డబ్బులు చేబదులు తీసుకుంటే చెప్పిన సమయానికి తిరిగి చెల్లించేస్తారు. అందుకు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తుల తరహాలనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆర్బీఐ చేబదుళ్లకు వెసులుబాటు కల్పి­స్తుంది. 

ఆ వెసులుబాటు సమయం వరకు చేబదుళ్లు వాడుకుని తిరిగి చెల్లించేస్తే ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పాలనలోనే సకాలంలో చేబదుళ్లు తిరిగి ఇవ్వలేక భారీగా వడ్డీలు చెల్లించిందని 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ పొందకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కనీస నగదు నిల్వను నిర్వహించడం ఘోరమని కాగ్‌ నివేదిక వెల్లడించింది. 

రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ స్ఫెషల్‌ వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్, వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాలను కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో కనీస నగదు బ్యాలెన్స్‌ రూ.1.94 కోట్లలోపు ఉంటే ఈ సౌకర్యాలను వినియోగించుకుంటాయి. 

ఆర్థిక అరాచకానికి నిదర్శనం
2024–25 ఆర్థిక ఏడాదిలో చంద్రబాబు సర్కారు 71 రోజులు రూ.42,004 కోట్ల మేర స్పెషల్‌ వేస్‌ అండ్‌ మీన్స్, 179 రోజులు రూ.73,897 కోట్ల మేర వేస్‌ అండ్‌ మీన్స్‌ వినియోగించుకుందని కాగ్‌ వెల్లడించింది. 107 రోజులు రూ.56,631 కోట్ల మేర ఓవర్‌ డ్రాఫ్ట్‌ను వినియోగించుకుందని స్పష్టం చేసింది. ఈ మొత్తాలను నిర్దేశిత సమయంలోగా తిరిగి చెల్లించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.303 కోట్ల మేర వడ్డీగా ఆర్‌బీఐకి చెల్లించినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. 

చేబదుళ్లకే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిందంటే ఆర్థిక నిర్వహణ ఎంత దారుణంగా దిగజారిపోయిందో అర్థం అవుతోంది. వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాఫ్ట్‌ను వినియోగించుకోవడంలో తప్పులేదు కానీ ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా వడ్డీ భారం పడకుండా చూడాలి. అందుకు భిన్నంగా ఏడాదిలోనే చేబదుళ్లకు ఏకంగా రూ.303 కోట్లు వడ్డీ చెల్లించడం అంటే బాబు ప్రభుత్వ ఆర్థిక అరాచకానికి నిదర్శనం.

స్ఫెషల్‌ వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌
42,004 (24%)
189

వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌
73,897 (43%)
82

మొత్తం
1,72,532
303

ఓవర్‌ డ్రాఫ్ట్‌
56,631 (33%)
32

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)