Breaking News

మళ్లీ వచ్చింది కన్సల్టెంట్ల రాజ్యం

Published on Thu, 05/29/2025 - 02:26

సాక్షి, అమరావతి: అమరావతిలో కన్సల్టెంట్ల రాజ్యం మళ్లీ వచ్చిoది. గతంలో కన్సల్టెంట్ల పేరిట రూ.వందల కోట్లు వ్యయం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే బాటలో కొనసాగుతున్నారు. అమరావతిలో ప్రతి ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రత్యేకంగా మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీలను నియమిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయడానికి డబ్బుల్లేవంటూనే అమరావతిలో కన్సల్టెంట్లకు భారీగా వ్యయం చేస్తున్నారు. ఇప్పటికే మూడు కన్సల్టెన్సీలను సీఆర్‌డీఏ నియమించింది. 

కొత్తగా జోన్‌–7లో చేపట్టే ప్రాజెక్టుకు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ కోసం సీఆర్‌డీఏ ప్రతిపాదనల్ని ఆహ్వానించింది. ప్రతిపాదనల సమర్పణకు వచ్చే నెల 4వ తేదీ వరకు గడువు విధించింది. అదేరోజు సాంకేతిక బిడ్‌ను తెరవనున్నట్టు సీఆర్‌డీఏ తెలిపింది. జూన్‌ 6న ఆర్థిక బిడ్‌ తెరుస్తామని స్పష్టం చేసింది. 7వ జోన్‌లో ల్యాండ్‌ పూలింగ్‌ పథకాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీని నియమిస్తున్నట్టు పేర్కొంది.   

ఇప్పటికే రూ.86.29 కోట్లు కన్సల్టెంట్లకు.. 
ఇప్పటికే జోన్‌ 2, 4, 6, 10లలో చేపట్టిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ను సీఆర్‌డీఏ ఎంపిక చేసింది. ఈ జోన్లలో చేపట్టే ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు తనిఖీ నివేదికలను సీఆర్‌డీఏకు సమర్పించే మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీని ఆర్వీ అసోసియేట్స్‌ ఆర్కిటెక్ట్స్‌ ఇంజినీర్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.42.33 కోట్లకు సీఆర్‌డీఏ అప్పగించింది.

జోన్‌ 12, 12ఏలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ బాధ్యతలను నిప్పాన్‌ కోయి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.34.27 కోట్లకు సీఆర్‌డీఏ అప్పగించింది. అమరావతి రాజధాని ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక నిర్వహణ కన్సల్టెంట్‌ను సీఆర్‌డీఏ నియమించింది. 

ఈ బాధ్యతను ప్రైస్‌ వాటర్‌ హౌస్‌కూపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.9.69 కోట్లకు సీఆర్‌డీఏ అప్పగించింది. ఇలా ఇప్పటికే రూ.86.29 కోట్లు కన్సల్టెంట్లకు దోచి పెట్టేందుకు నిర్ణయించగా.. తాజాగా ఎంపిక చేయనున్న కన్సల్టెన్సీకి రూ.10.60 కోట్లు చెల్లించనున్నట్టు ప్రతిపాదనల ఆహ్వాన పత్రంలో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది. 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)