Breaking News

చిలుకలూరిపేట: సహజీవనానికి ప్రియుడు బలి

Published on Sat, 01/04/2025 - 14:12

చిలకలూరిపేటటౌన్‌: వారిద్దరిలో ఒకరికి పెళ్లీడుకొచ్చిన పిల్లలుంటే, మరొకరికి అల్లుళ్లు సైతం ఉన్నారు. అయినా వారి వివాహేతర బంధం వీడలేదు. పలుమార్లు ఎందరో నచ్చజెప్పినా వినలేదు. చివరకు ఆ సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొంది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శాంతినగర్‌ వాసి, మినీ ఆటో డ్రైవర్‌ పాలపర్తి నాగరాజు అలియాస్‌ తిమ్మిరి(45) డైక్‌మెన్‌ నగర్‌కు చెందిన ఓ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అక్కల చెంచయ్య భార్య నన్నీతో మూడేళ్ల కిందట వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పలుమార్లు ఇద్దరూ తమ కుటుంబాలను విడిచి వెళ్లిపోయిన ఘటనలు ఉన్నాయి. 

  నన్నీకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అల్లుళ్లూ వచ్చారు. నాగరాజుకు పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉన్నారు. అతడి భార్య నాగమ్మ ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. నన్నీ, నాగరాజుకు సంఘ పెద్దలు, పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి మార్పూ రాలేదు. పైగా సుభాని నగర్‌ వాగు సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. దీంతో నాగరాజుపై నన్నీ భర్త చెంచయ్య కక్ష పెంచుకున్నాడు. తన అన్న కుమారుడు అక్కల ప్రభుదాసుతో కలిసి హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించాడు. అక్కయ్య కుమారుడితో కలిసి నన్నీ, నాగరాజు ఉండే ప్రాంతానికి వెళ్లారు. 

అదే సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న నన్నీ తమ్ముడికి భోజనం ఇచ్చేందుకు క్యారేజీ తీసుకుని నాగరాజు, నన్నీ బయలుదేరారు. దీంతో ప్రభుదాసు, చెంచయ్య వారిని అడ్డగించారు. నన్నీని అక్కడి నుంచి పంపివేశారు. వెంటనే నాగరాజును రేకుల షెడ్డులోకి లాక్కెళ్లి కూరగాయల చాకుతో గొంతుకోసి హత్యచేసి పరారయ్యారు. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. నాగరాజు భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)