ఫేస్‌బుక్‌లో స్నేహం.. పెట్టుబడి మోసం

Published on Thu, 08/14/2025 - 08:57

విశాఖపట్నం: ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని పెట్టుబడి పేరుతో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ నుంచి రూ.49.72 లక్షలు దోచుకున్న రిలేషన్‌షి  ప్‌ మేనేజర్‌ సతీష్‌ కుమార్‌ను నగర సైబర్‌ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. డిజిటల్‌ మోసాలపై సైబర్‌ క్రైం పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్‌ చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు.

 ఎంవీపీకాలనీ, సెక్టార్‌–6కి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్‌ ప్రొఫెసర్‌తో నిందితుడు సతీష్‌ కుమార్‌ ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి పెట్టుబడి పెట్టాలంటూ ఆశ చూపా డు. తద్వారా అతని నుంచి దశలవారీగా రూ.49.72 లక్షలు కాజేశాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని సెక్టార్‌–16కి చెందిన సతీష్‌ కుమార్‌గా గుర్తించారు. 

నిందితుడు నోయిడా వరల్డ్‌ ట్రేడ్‌ టవర్‌లో రిలేషన్‌íÙప్‌ మేనేజర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సతీష్‌ కుమార్‌ తన ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ కరెంట్‌ అకౌంట్‌ను సైబర్‌ నేరగాళ్లకు ఇచ్చి భారీ మోసాలకు సహకరించినట్లు తేలింది. ఈ అకౌంట్‌  ద్వారా వారు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై 111(2), 319(2), 318(4) రెడ్‌/విత్‌ 61(2) బీఎన్‌ఎస్, 66–సీ, 66–డీ ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు(నం. 112/2025) నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)