కాటేసిన కట్లపాము తల కొరికేశాడు

Published on Sat, 09/20/2025 - 08:58

తిరుపతి జిల్లా: మద్యం మత్తులో ఓ వ్యక్తి తనను కాటేసిన కట్లపామును పట్టుకుని తల కొరికేశాడు. ఆ పామును ఇంటికి తీసుకువెళ్లి తన పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. ఈ విచిత్ర ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో గురువారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు... చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేష్‌ (47) గ్రామంలో జాతర సందర్భంగా గురువారం రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా కట్లపాము కాటేసింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేష్‌ వెంటనే ఆ పామును పట్టుకుని తల కొరికేశాడు. 

ఆ పామును చేతపట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి మంచంలో తన పక్కనే పెట్టుకుని నిద్రించాడు. ఉదయం కుటుంబ సభ్యులు నిద్ర లేచే సమయానికి వెంకటేష్‌ అపస్మారక స్థితిలో ఉన్నాడు. పక్కన చనిపోయిన పాము ఉంది. వెంటనే అతడ్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాము కాటు వేయడం వల్ల వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)