Breaking News

జనసేన నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published on Tue, 11/04/2025 - 04:54

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘కూటమి’ ప్రభుత్వ వేధింపులతో కర్ణాటక వాసి ఆత్మహత్యకు యత్నించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన ఇన్‌చార్జ్‌ మంజునాథ్‌కు మద్దతుగా పోలీసులు చేసిన ఈ చర్య ‘అనంత’లో కలకలం రేపుతోంది. మంజునాథ్‌కు రాయ­దుర్గం, కర్ణాటక సరిహద్దు బండ్రావి అనే గ్రామంలోని రాగుల సిద్ధప్పకు మధ్య నగదు లావాదేవీలున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలలో మంజునాథ్‌కు సిద్ధప్ప బాకీ పడ్డాడు. ఈ క్రమంలో మంజునాథ్‌ సిఫార్సుతో రాయదుర్గం పోలీసులు సిద్ధప్పను అదుపులోకి తీసుకున్నారు.  అతడిని వేధించడంతో పాటు రెండు రోజులు చిత్తకొట్టినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగక సిద్ధప్పకు సంబంధించిన రెండు ట్రాక్టర్లు, రెండు బొలెరో వాహనాలను కూడా స్టేషన్‌కు తెప్పించారు.

సిద్ధప్ప తండ్రి బండ్రావప్పను సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ గురుప్రసాద్‌ పిలిపించారు. డబ్బుల విషయమై ఒత్తిడి చేశారు. దీంతో వారికి బండ్రావప్ప రూ.10 లక్షలిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.లక్ష వారు తీసుకుని, రూ.9 లక్షలు మంజునాథ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో రూ.20 లక్షలు అప్పు ఉందని తేల్చి, ఖాళీ పత్రాలపై బండ్రావప్పతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. కుమారుడిపై పోలీసుల దాడి, తనతో బలవంతంగా సంతకాలు, వాహనాలు తీసుకెళ్లడంతో గ్రామంలో పరువు పోయిందని భావించిన బండ్రావప్ప ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు బళ్లారిలోని విమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 

	జనసేన నేత వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఉలిక్కిపడిన పోలీసులు 
బండ్రావప్ప ఆత్మహత్యాయత్నంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. తమ అదుపులో ఉన్న సిద్ధప్ప, వాహనాలను వదిలిపెట్టారు. బండ్రావప్పను ఎవరూ కలవకుండా, ఆస్పత్రిలో ఫొటోలు తీయకుండా తమకు అనుకూలమైన ఒక లెక్చరర్‌ను కాపలా ఉంచారు. ఇక వ్యవహారం రాయదుర్గంలోని కీలక ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. దీంతో విషయం బయటకు రానీయొద్దని, సిద్ధప్పను ఒప్పించి ఆయన ఇచ్చిన రూ.10 లక్షలు తిరిగి ఇచ్చేస్తామని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)