Breaking News

పారని మంత్రి సుభాష్‌ పాచిక

Published on Sat, 08/31/2024 - 04:02

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ద్రాక్షారామం జగనన్న కాలనీలో ఇసుక చోరీ వ్యవహారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అనుచరుల మెడకే చుట్టుకుంది. ఈ వ్యవహారం నుంచి తన అనుచరులను తప్పించేందుకు మంత్రి రెండు రోజులుగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన అనుచరులే ఇసుకను చోరీ చేశారని తేటతెల్లమవటంతో చేసేది లేక అధికార యంత్రాంగం కేసు నమోదు చేసింది. 

మంత్రి ప్రధాన అనుచరుల్లో ఒకరైన టీడీపీ నేత దొంగల శ్రీధర్, మరి కొందరిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని రామచంద్రపురం ఆర్డీవో ఎస్‌.సుధాసాగర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 26న ద్రాక్షారామ జగనన్న కాలనీ లేఅవుట్‌–04లో జరిగిన ఇసుక దోపిడీపై ‘జగనన్న కాలనీలో టీడీపీ దొంగలు’ అనే శీర్షికతో ‘సాక్షి’  వెలుగులోకి తెచ్చిం ది. ఈ కథనం అధికారులను, అధికార పార్టీ నేతలను పరుగులు పెట్టించింది. 

ఈ కేసు నుంచి మంత్రి సుభాష్‌ అనుచరుడు దొంగల శ్రీధర్‌ను తప్పించే ప్రయత్నాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. అయినా అతనిపైన, ఇతర అనుచరులపైన కేసు నమోదు కాకుండా మంత్రి సుభాష్‌ తీవ్రంగా ప్రయతి్నంచారు. అధికార బలాన్ని ఉపయోగించారు. మంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇసుక వ్యవహారంలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇదంతా వైఎస్సార్‌సీపీ నేతల పనేనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసికొట్టాయి. 

ఆయన మీడియా సమావేశం పెట్టిన రెండు గంటలకే అధికారులు దొంగల శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనే ఇసుక చోరీలో నిందితుడని స్పష్టం చేశారు. కాగా, ఈ ఇసుక దోపీడిపై పోలీసులు కేసు నమోదు చేసిన వాసంశెట్టి బాల, కాండ్రేగుల సాయిరాంలను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు మంత్రి సుభాష్‌ ప్రకటించారు. ప్రధాన అనుచరుడైన దొంగల శ్రీధర్‌పై మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.  

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)