ఏపీ హైకోర్టుకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జెల లక్ష్మీ

Published on Thu, 09/26/2024 - 16:32

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ గజ్జల లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్స్‌గా తన నియామకాన్ని రద్దు చేయటాన్ని హైకోర్టులో ఆమె సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు(గురువారం) విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికి, రాజకీయ ప్రయోజనాలతో తొలగించారని కోర్టుకు తెలిపారు.

2023లో సడలించిన చట్టం ప్రకారం అయిదు సంవత్సరాల కాల పరిమితి నుంచి రెండు సంవత్సరాల కాల పరిమితికి పరిమితం చేయటంతో పిటిషనర్ కాల పరిమితి ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే గజ్జల లక్ష్మీని చైర్‌ పర్సన్‌గాతొలగించారని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులను ఇలా తొలగించటం నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు.

మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గత చైర్‌పర్సన్‌ పదవి కాలం ఆగస్టుతో ముగిసిపోయినందున పిటిషనర్ నియామకం కూడా రద్దయినట్టుగా భావించాలని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డార,ని రెండు సంవత్సరాల కొనసాగింపు కోరే హక్కు ఆమెకు లేదని చెప్పారు. ఇరువురి వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

వెంకట లక్ష్మి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)