Breaking News

సీబీఐ విచారణకు సిద్ధమా?.. పరిటాల శ్రీరామ్‌కు తోపుదుర్తి సవాల్‌

Published on Mon, 01/27/2025 - 12:39

అనంతపురం, సాక్షి: మహేష్ రెడ్డి అనే యువకుడి మృతి కేసులో తనపై వస్తున్న రాజకీయపరమైన ఆరోపణలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. సోమవారం ఉదయం ఆయన ఈ అంశం‍పై మీడియాతో మాట్లాడారు. 

‘‘తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి వాట్సాప్ స్టాటస్ లో లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించిన మేసేజ్ లు ఉన్నాయి. అలాంటిది మా అన్నదమ్ముల పాత్ర ఉందంటూ పరిటాల శ్రీరామ్‌ చెప్పడం సరికాదు. 

ఈ కేసులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం. మహేష్ రెడ్డి మృతికి మేము కారణమని ఆరోపించటం సరికాదు. తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్య పై సీబీఐ విచారణ కు సిద్ధం.. మీరు సిద్ధమా?’’ అని శ్రీరామ్‌కు సవాల్‌ ప్రకాష్‌ రెడ్డి విసిరారు. మహేష్ రెడ్డి కి పరిటాల శ్రీరామ్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి ని పరిటాల శ్రీరామ్ వాడుకుని వదిలేశారు అని ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. 

ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి.. సోమలదొడ్డినాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. అయితే అతని మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని, ప్రకాష్‌ రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డిల ప్రమేయం ఉందంటూ  ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)