Breaking News

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Published on Fri, 03/08/2024 - 06:58

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

అంబేద్కర్ కోనసీమ జిల్లా:
శివనామ స్మరణతో కోటిపల్లి, ద్రాక్షారామ పుణ్యక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రినీ పురస్కరించుకొని కోటిపల్లి ద్రాక్షారామం ఆలయాలలో క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. వేకువజామున  నుంచి భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.

నంద్యాల:
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం బారులు తీరారు. వేకువజాము నుండి పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద శివ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో నేడు పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

కరీంనగర్‌:
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధి భక్త జనసంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరుగనున్న జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పించింది. మరో వైపు పంచాక్షరీ నామస్మరణతో రాజన్న సన్నిధి మార్మోగుతోంది.

👉: (మహాశివరాత్రి 2024: శ్రీశైలంకు భారీగా భక్తజనం (ఫొటోలు)

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)