Breaking News

AP: నిన్న వీఆర్వో.. నేడు సీఐ.. మహిళలపై ఆగని వేధింపులు

Published on Mon, 02/10/2025 - 10:46

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాడిపత్రి వీఆర్వో వేధింపుల ఘటన మరువకముందే మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మడకశిరలో సీఐ.. ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. దీంతో, బాధితురాలు పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, యువతులపై వేధింపులు పెరిగాయి. కూటమి నేతల అండతో కొందరు అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలపై కొందరు ఉద్యోగుల లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. దీంతో, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా మడకశిర పోలీసు స్టేషన్‌లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన బయటకు వచ్చింది.

అయితే, కేసుతో సంబంధం లేకుండా సదరు సీఐ.. ఓ మహిళను రాత్రి 10 గంటల వరకు తన చాంబర్‌లోనే ఉంచారు. విచారణ పేరుతో ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. అనంతరం, బాధితురాలు.. ధైర్యం చేసుకుని సీఐ తనను లైంగికంగా వేధించారని పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సీఐ అరాచకం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా.. తాడిపత్రి వీఆర్వో చంద్రశేఖర్ వేధింపుల ఘటన కూడా తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగ­మునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్‌ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడా­దిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది. పదే పదే వీఆర్వోను బతిమా­లు­తుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్‌ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పి­స్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ మహిళలను వేధించిన మడకశిర సీఐ, తాడిపత్రి వీఆర్వోలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, బాధితులు, ప్రజలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)