Breaking News

మధ్యవర్తిత్వంతో తక్కువ ఖర్చు.. సత్వర న్యాయం

Published on Sun, 01/26/2025 - 04:57

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): న్యాయవాదులు మధ్యవర్తిత్వ పద్ధతులపై మెళకువలు పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయాన్ని అందించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి అన్నారు. మధ్యవర్తిత్వం మరింతగా అందు­బాటు­లోకి తీసుకువచ్చేందుకు న్యాయవాదులు ఎక్కువ దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీ న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యాన గుంటూరు మెడికల్‌ కళాశాలలో శనివారం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సును ప్రారంభించిన జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి మాట్లా­డుతూ పెరిగిపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి అవకాశమని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని వివరించారు. వ్యాపార, కుటుంబ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇరుపక్షాలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. మధ్యవర్తిత్వంపై నెలకొన్న అపోహలు వీడాలని, ఈ విధానాన్ని ప్రజల ముంగిటకు తీసుకువెళితే న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.  

ఆన్‌లైన్‌ ద్వారా కూడా మధ్యవర్తిత్వం: జస్టిస్‌ రావు రఘునందన్‌రావు 
సదస్సు ముగింపు సెషన్‌లో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ రావు రఘునందన్‌రావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ప్రత్యేక చట్టం చేశారని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా మధ్యవర్తిత్వం నిర్వహించే వెసులుబాటు ఉందని చెప్పారు. ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ఇటీవల వస్తున్న మార్పులు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.

ఇప్పటి వరకు అన్ని బార్‌ అసోసియేషన్లలో, జిల్లా, మండల, హైకోర్టు స్థాయిల్లో నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి, ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్‌ హెచ్‌.అమర రంగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి, సీనియర్‌ ట్రైనర్స్‌ రత్నతార, అరుణాచలం పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)