Breaking News

మళ్లీ పుట్టి... ఒక్కటవుతాం..!

Published on Sat, 04/26/2025 - 08:41

నెల్లూరు (క్రైమ్‌): వారిద్దరూ ప్రేమించుకున్నారు. కారణాలు ఏవైనా వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వారిని ఎదిరించి ఒక్కటయ్యే ధైర్యంలేక ఊరుకాని ఊరు వచ్చారు. లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు సూసైడ్‌ లేఖ రాశారు. ‘‘అమ్మ, నాన్నలు క్షమించండి. మీరు మా ప్రేమను ఎలాగూ అంగీకరించడం లేదు. మళ్లీ పుట్టి అందరి అంగీకారంతో ఒక్కటవుతాం’’ అంటూ రాసి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన నెల్లూరులోని ఒక లాడ్జిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల సమాచారం ప్రకారం,  తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బాచ్చు జోసఫ్‌ రత్నకుమార్‌ (23), కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లుముంత శ్రావణి (21) మధ్య బీటెక్‌ చదివే సమయంలో చిగురించిన స్నేహం, అటుపై ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 21వ తేదీన నెల్లూరు వచ్చారు. కళాశాలలో కౌన్సెలింగ్‌ ఉందని చెప్పి ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కౌన్సెలింగ్‌ పూర్తికాలేదని మరో రోజు గదికి నగదు చెల్లించారు. 23వ తేదీన గదిని శుభ్రం చేసేందుకు లాడ్జి స్వీపర్‌ వెళ్లి తలుపుకొట్టగా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. 

బయటకు వెళ్లి ఉంటారని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు అలానే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం వారు అద్దెకు తీసుకున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి సిబ్బంది సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ జి.దశరథరామయ్య, ఎస్‌ఐ బాలకృష్ణ తలుపులు పగులగొట్టి చూడగా, బెడ్‌పై జోసఫ్‌ రత్నకుమార్, నేలపై శ్రావణి మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో పడి ఉన్నాయి.

 సమీపంలో గడ్డిమందు సీసా పడి ఉంది.దీంతో వారు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.  వారి బ్యాగ్‌లను పరిశీలించగా అందులో మృతుల ఆధార్‌ కార్డులు, కళాశాలలకు సంబంధించిన సరి్టఫికెట్లు ఉన్నాయి. ఇరువురు తమ తల్లిదండ్రులకు రాసిన సూసైడ్‌ లేఖలను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి 
సంతపేట ఇన్‌స్పెక్టర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


 
 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)