Breaking News

లోకేశ్‌ ‘రెడ్‌ డైరీ’ కేసు 30కి వాయిదా 

Published on Wed, 01/24/2024 - 05:42

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను భయభ్రాంతులకు గురిచేసేలా నారా లోకేశ్‌.. అధికారులను బెదిరిస్తున్నారన్న సీఐడీ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది. గతంలో ఆయనకు ఇచ్చిన 41ఏ నోటీసులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

గతంలో 41ఏ నోటీస్‌ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించిన విషయాన్ని ఆధారాలతో సహా నివేదించింది. రెడ్‌ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలని పిటిషన్‌లో కోరింది. కాగా ఈ కేసులో జారీ చేసిన నోటీసులను తీసుకునేందుకు లోకేశ్‌ సుము­ఖత చూపలేదు.

ఆ నోటీ­సులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్‌ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్‌ నిరాకరించారు. నోటీసులను లోకేశ్‌ మొబైల్‌ నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఆ విషయాన్ని కూడా సీఐడీ అధి­కా­రులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.

దాంతో న్యాయస్థానం ద్వారా నోటీ­సులు జారీ చేయాలని కోర్టు రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు. లోకేశ్‌ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని లోకేశ్‌ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానాన్ని మంగళవారం కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)