Breaking News

లోన్‌ యాప్‌ వేధింపులు.. మహిళకు అండగా నిలిచిన ‘దిశ’ యాప్‌

Published on Wed, 06/28/2023 - 14:43

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: లోన్ యాప్ నిర్వాహకుల వికృత చేష్టలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మహిళకు దిశ యాప్ అండగా నిలిచింది. లోన్ తీసుకోకపోయిన డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ టూ టౌన్ పరిధిలోని మహిళకు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. దుర్భాషలాడుతూ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేయడంతో  దిశ(ఎస్‌వోఎస్‌)కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి లొకేషన్‌కు చేరుకున్న దిశ పోలీసులు వివరాలు సేకరించారు.

బాధితురాలి కుమారుడు సెల్ ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ పొరపాటున లోన్ యాప్ నోటిఫికేషన్‌ను క్లిక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నోటిఫికేషన్ క్లిక్ చేయగానే రెండు వేలు ఆటోమెటిక్ గా బాధితురాలి ఖాతాలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. బాధితురాలి సెల్ ఫోన్‌కు పంపించిన అసభ్యకరమైన వీడియోలతో పాటు ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులు సేకరించారు.
చదవండి: యాప్‌లతో సేఫ్టీకి భరోసా!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)