Breaking News

ఆధ్యాత్మిక క్షేత్రం.. అపవిత్రం!

Published on Mon, 03/31/2025 - 04:10

18/01/2025
తమిళనాడుకు చెందిన 30 మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారు తమ వెంట గుడ్డు బిర్యానీ తెచ్చుకుని బహిరంగంగా తింటూ ఉండగా భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బిర్యానీ స్వాధీనం చేసుకుని భక్తులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.

15/03/2025
తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలోని శ్రీ భూవరాహ స్వామి ఆలయం వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. ఓ మహిళా భక్తురాలిపై దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించాడు. ‘తిరుమలలో మద్యం ఎంత కావాలన్నా తాగుతా.. ఎంత మద్యం కావాలో చెప్పు నీకు తెచ్చిస్తా’ అంటూ అతను చెలరేగిపోయాడు. ఈ విషయం ఒక విజిలెన్స్‌ కానిస్టేబుల్‌కి సైతం తెలుసు అంటూ రెచ్చిపోయాడు.  

తిరుమల: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రం కూటమి పాలనలో అపవిత్రమవుతోంది. శ్రీవారి క్షేత్రంలో తరచూ మద్యం, మాంసం, మత్తుపదార్థాలు ప్రత్యక్షమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమార్కులు చెలరేగిపోతుండడంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. గంజాయి ప్యాకెట్లు సైతం దొరుకుతున్నాయి. మద్యం, గంజాయి మత్తులో భక్తులపై దాడులకు పాల్పడుతున్నారు. నిఘా వ్యవస్థ నిద్దరోతుండడంతో కొందరు అక్రమార్కులు మత్తుపదార్థాలను రోడ్డు మార్గంలో తరలిస్తుండగా.. మామండూరు, అన్నమయ్య నడక మార్గాల గుండా మరికొంత తరలిస్తున్నట్లు సమాచారం. 

ఇంటినే బెల్ట్‌ షాపుగా మార్చిన ఘనుడు! 
తిరుమలలోని ఈస్ట్‌ బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న రమేష్ ను మూడు రోజుల క్రితం ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను తిరుమలలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతి నుంచి తన వాహనంలో నిత్యం మద్యం బాటిల్స్‌ను అక్రమంగా తిరుమలకు తరలించేవాడు. కొంతకాలంగా ఇతని వ్యవహారం మూడు క్వార్టర్లు, ఆరు ఫుల్‌బాటిళ్లుగా వర్ధిల్లింది. ఎక్సైజ్‌ అధికారులకు అనుమానం వచ్చి రమేష్ పై నిఘా పెట్టారు. అతను తన ఇంటినే బెల్ట్‌ షాపుగా మార్చి మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. మద్యం బాటిళ్లు స్వా«దీనం చేసుకున్నారు.  

భద్రతా వ్యవస్థ వైఫల్యమే
తిరుమలలో నిత్యం మూడంచెల భద్రత ఉంటుంది. భక్తుల రక్షణ, శ్రీవారి ఆలయ భద్రత నిర్వహణకు టీటీడీ విజిలెన్స్, స్టేట్‌ పోలీస్, ఎస్బీ, విజిలెన్స్‌ వింగ్‌.. ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. పోలీస్‌ శాఖ నుంచి అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు భద్రతా ప్రమాణాలు చేపడుతుంటే.. సీవీఎస్వో, వీజీవో, ఏవీఎస్వో, వీఐ, ఇతర అదనపు సిబ్బంది ఆలయ భద్రతతోపాటు భక్తులకు రక్షణ కల్పిస్తుంటారు. తిరుపతి నుంచి తిరుమలకు మద్యం, ఇతర మత్తుపదార్థాలు రాకుండా అలిపిరిలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అయినా వాటి కళ్లుగప్పి తనిఖీలను దాటుకొని మత్తు పదార్థాలను తిరుమలకు చేరుస్తున్నారు.  ఇక అదనంగా తిరుమలలో ఎౖMð్సజ్‌ ప్రొహిబిషన్‌ విభాగం అధికారుల నిఘా ఉంటుంది. ఇతర మత్తు పదార్థాలను గుర్తించి సీజ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, ఏ విభాగం అధికారులు కూడా తిరుమలలో మద్యం, గంజాయి విక్రయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి నిరోధించకపోవడం గమనార్హం. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)