Breaking News

ఇక పిడుగుల మోతతో వానలు

Published on Wed, 06/12/2024 - 05:14

సాక్షి, విశాఖపట్నం/అనంతపురం (అగ్రికల్చర్‌): రాష్ట్రంలో పిడుగులు మోత మోగించను­న్నా­యి. రానున్న ఐదు రోజులు ఇవి దడ పుట్టిం­చ­నున్నాయి. రెండు మూడు మినహా మిగిలిన జిల్లాల్లో పిడుగులు ప్రభావం చూపను­న్నాయి. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవను­న్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1, 5.8 కి.మీ. మధ్య ఉన్న గాలుల కోత, షీర్‌ జోన్‌ కొన­సాగుతున్నాయి. 

ఫలితంగా బుధ, గురు­వా­­రా­ల్లో అల్లూరి సీతారామ­రాజు, పార్వతీ­పురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదా­వరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూ­రు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూ­లు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్య­సా­యి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరు­పతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

శుక్రవారం శ్రీకా­కుళం, విజయనగరం, పార్వ­తీ­పురం మన్యం, అల్లూరి సీతారామ­రాజు, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూ­లు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్య­సాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మో­స్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో వానలు, ఉరుములు, మెరుపు­లతోపాటు పిడుగులు కూడా సంభవిస్తాయంది. 

‘అనంత’లో వర్షాలు
జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు  జిల్లాలోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఉరవకొండలో 29.6 మి.మీ, పామిడిలో 20.4 మి.మీ, వజ్రకరూ­రులో 20.2 మి.మీ, గార్లదిన్నెలో  20 మి.మీ. చొప్పున వర్షపాతాలు నమోద­య్యాయి. పెద్దవడు­గూరు, శింగనమల,  గుంతకల్లు, యాడికి, పుట్లూ­రు, యల్లనూరు, గుత్తి, రాయదుర్గం, అనంత­పురం, బుక్క­రాయ­సముద్రం, ఆత్మకూరు, నార్పల తదితర మండలాల్లో మోస్తరు వర్షం  కురిసింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)