Breaking News

తిరుమల: చిరుత దాడి నుంచి తృటితో తప్పించుకుని..

Published on Sat, 07/26/2025 - 06:58

తిరుమలలో మరోసారి చిరుత పులి అలజడి రేగింది. అలిపిరి-ఎస్వీ పార్క్‌ జూ రోడ్డులో వెళ్తున్న బైకర్లపై చిరుత దాడికి యత్నించింది. అయితే బైకర్లు తృటిలో తప్పించుకోగా.. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

తిరుమలలో శుక్రవారం సాయంత్రం బైకర్ల మీద ఓ చిరుత దాడికి యత్నించింది. రోడ్డు పక్కన కల్వర్టు మాటున దాక్కుని.. బైక్‌ రాగానే వాళ్ల మీదకు దూకింది. అయితే వాళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే చిరుత పొదల్లోకి వెళ్లింది.  వెనక కారులో వస్తున్నవాళ్లు  ఆ ఘటనను వీడియో తీశారు. అందకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది. అయితే ఈ వీడియోపై అధికారులు స్పందించాల్సి ఉంది.

 

 

 తిరుమలలో ఈ మధ్యకాలంలో వన్యమృగాల సంచారం పరిపాటిగా మారింది. 

 

  • జూలై 2025: అన్నమయ్య భవనం వెనుక చిరుత గేటుపై కూర్చొన్న ఘటన భక్తులను ఆందోళనకు గురిచేసింది.

  • జూన్ 2025: అదే ప్రాంతంలో మరో చిరుత ఇనుప కంచె దాటి ప్రవేశించింది. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి.

  • 2024లో: అలిపిరి కాలిబాట మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్లు సంచారం కారణంగా భక్తులపై దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో TTD అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు.

వన్యమృగాల కదలికలను గుర్తించేందుకు అధునాతన GSM టెక్నాలజీతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో.. రాత్రి నడక మార్గం మూసివేతతో పాటు సిబ్బందితో గుంపులుగా పంపించడం వంటి చర్యలు తీసుకున్నారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)