భారతీయుల రూటే.. సపరేటు

Published on Sat, 05/10/2025 - 06:15

సాక్షి, అమరావతి :  ఋగ్వేదంలోనే యోగా గురించి ప్రస్తావించాం. సింధు లోయ నాగరికతలోనే టాయిలెట్లను 
వినియోగించాం. గూస్బెర్రీ వంటి మొక్కల సారాన్ని వినియోగించి షాంపూలు తయారు చేశాం..  ‘సున్నా’కు విలువ కనిపెట్టి ప్రపంచానికి అందించాం.  ఇలా విశ్వజగతికి భారతీయులు ఆది నుంచి నాయకులుగానే పరిచయమయ్యారు. నేటికీ అదే విధంగా ఉండేందుకు, గ్లోబల్‌ లీడర్లుగా పిలిపించుకునేందుకు భారతీయులు ఇష్టపడుతున్నారు. అందుకోసమే కష్టాన్నీ సంతోషంగా స్వీకరిస్తున్నారు. 

ప్రపంచ ప్రముఖ కార్యనిర్వాహక పరిశోధన సంస్థ అయిన అమ్రోప్‌ నిర్వహించిన అధ్యయనంలో భారత్‌ ప్రజల తాజా మనోగతం ఆవిష్కృతమైంది. గ్లోబల్‌ సౌత్‌ దేశాలైన భారత్, చైనా, బ్రెజిల్‌తోపాటు పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్‌లో పని వైఖరిపై అమ్రోప్‌ తాజాగా అధ్యయనం జరిపింది. 

కష్టించి పనిచేయడం వల్లనే గుర్తింపు లభిస్తుందని, జీవితం సంతృప్తికరంగా ఉంటుందని, ఆశయం నెరవేరుతుందని భారతీయులు నమ్ముతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సర్వేలో  20 ఏళ్లు నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల బ్యాచిలర్‌ డిగ్రీ, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న 8 వేల మంది నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.  ప్రతి దేశం నుంచి వెయ్యి మంది సర్వేలో పాల్గొన్నారు.  

అధ్యయనంలోని ముఖ్యాంశాలు:
» భారతీయుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. 92 శాతం మంది పని చేయడంలోనే సంతోషం ఉందని అంటున్నారు.  
»  73% మంది మంచి ఉద్యోగం, జీవితం ఉండాలని కోరుకుంటున్నారు.  
»75% మంది కష్టపడి పనిచేయడం సాధారణంగా మనిషి ధర్మమని నమ్ముతున్నారు.
» 42% మంది వారానికి 40 గంటలకు మించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఫ్రాన్స్‌లో 16 శాతంగా ఉంది.
» 76 శాతం మంది భారతీయ నిపుణులు ఒక కంపెనీని నడిపించాలని లేదా తామే సొంతంగా ఒక సంస్థను 
నిర్వహించాలని కోరుకుంటున్నారు. జర్మనీలో ఇలాంటి వారు 36% కాగా, అమెరికాలో 49% మంది ఉన్నారు.  
» తామేంటో నిరూపించుకునేలా పనిచేయాలని 73% మంది భారతీయులు అనుకుంటున్నారు. జర్మనీలో ఇలాంటి వారి సంఖ్య 41 శాతం మాత్రమే ఉంది.  
»మన దేశంలో 84 శాతం మందికి చదువు, వ్యాపారం, ఉద్యోగం వంటి మంచి కెరీర్‌ ముఖ్యంగా భావిస్తున్నారు. 
»పాశ్చాత్య దేశాల్లో మాత్రం 62% మంది తాము కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొనడం గమనార్హం.  
» రాజకీయ నాయకుడిగా ఉండేందుకు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ఇష్టపడటం లేదు.  

Videos

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)