ఎన్నికల హామీ ‘రూ.10 వేల స్టైపెండ్‌’ ఎక్కడ?

Published on Sun, 08/02/2026 - 05:07

విజయవాడ లీగల్‌: న్యాయవాదుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నా జరిగింది. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని, స్టైపెండ్‌ బకాయిలు చెల్లించాలనే నినాదాలతో ధర్నా చౌక్‌ ప్రాంతం దద్దరిల్లింది. ఐలూ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘న్యాయవాదులను పబ్లిక్‌ సర్వెంట్లుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి. 

గత ప్రభుత్వం వైఎస్సార్‌ లా నేస్తం పేరుతో పథకాన్ని ప్రారంభించి జూనియర్‌ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడటానికి రూ.5 వేలు స్టైపెండ్‌ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఆ పథకం పేరును న్యాయమిత్రగా మార్చింది. ఇంతవరకు జూనియర్‌ న్యాయవాదులకు ఎటువంటి స్టైపెండ్‌ ఇవ్వలేదు. ఎన్నికల వాగ్ధానంలో హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.10 వేలు స్టైపెండ్‌ను, పాత బకాయిలతో సహా వెంటనే విడుదల చేయాలి. అర్హులైన న్యాయవాద కుటుంబాలకు హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. ఐలూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దిగుబాటి రాజగోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు కెంగర కుమార్, ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు తదితరులు మాట్లాడారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)