Breaking News

అప్పులే అప్పులు.. సర్కారు గొప్పలు!

Published on Wed, 06/17/2026 - 05:31

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే భారీగా అప్పులు చేస్తోంది. ఫలితంగా రాష్ట్ర అప్పుల చిట్టా రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రతి నెలా అప్పులతో పాటు చేబదుళ్లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌లతోనే పాలన కొనసాగుతోంది. అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తున్నారని, ఏడాదిలో 357 రోజులు చేబదుళ్లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌లేనని కాగ్‌ కూడా ఎత్తి చూపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు అప్పులు చేయడంలో వేగంగా దూసుకుపోతోంది తప్ప వెనకడుగు వేయడం లేదు. 

మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.4,600 కోట్ల అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్‌ బయట, బడ్జెట్‌ లోపల.. కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా రూ.3,51,695 కోట్లకు చేరాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కుతుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా అప్పులు చేయలేదు. 

ఒక పక్క అప్పులు భారీగా.. వేగంగా పెరిగిపోతుండగా, మరో పక్క రాష్ట్ర రాబడులు తగ్గిపోతున్నాయి. ఇంత అప్పు చేసినా అభివృద్ధి లేదు. సంక్షేమ కార్యక్రమాల అమలు లేదు. అప్పులతో కొత్తగా ఆస్తులు సృష్టించకపోగా, ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందంటూ ఒక పక్క చంద్రబాబు గొప్పలు చెబుతుండగా, అందుకు తగినట్లు రాష్ట్ర రాబడులు పెరగనందున బాబు గొప్పలన్నీ అబద్ధాలని తేలిపోతోంది. 

చేసిన అప్పులను సంక్షేమ పథకాల అమలుకు గానీ, ప్రభుత్వ రంగంలో వైద్య, విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు గానీ వెచ్చించకుండా రెవెన్యూ వ్యయాలకు మళ్లించేస్తోంది. దీంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించక పోవడంతో ప్రస్తుతమే కాకుండా భవిష్యత్‌ అభివృద్ధిని సైతం శూన్యం చేశారని కాగ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్ర నిబంధనలు, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను తుంగలో తొక్కి.. దొరికిన చోటల్లా అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోంది. మద్యం ఆదాయంతో పాటు, గనులను తాకట్టు పెట్టి, బడ్టెట్‌ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. కొత్తగా ఆస్తులు, సంపద సృష్టి లేకపోగా, ఉన్న ఆస్తులు సైతం ప్రైవేట్‌ పరం చేస్తుండటం గమనార్హం. 


Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)