Breaking News

విశాఖ అయోధ్య రామయ్య సెట్‌ మూసివేత

Published on Sat, 07/26/2025 - 11:48

సాక్షి, విశాఖపట్నం: దేవుడి పేరిట జరిగిన వ్యాపారానికి చెక్‌ పడింది. వివాదాల నేపథ్యంలో నగరంలో ఏర్పాటు అయిన అయోధ్య రామయ్య సెట్‌ మూతపడింది. నిర్వాహకులు ఇచ్చిన స్టేటమెంట్‌ తప్పు అని గుర్తించిన పోలీసులు.. వాళ్లకు నోటీసులు సైతం జారీ చేశారు.  

విశాఖపట్నంలో అయోధ్య ఆలయాన్ని తలపించే సెటప్ మొదటి నుంచి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తి ముసుగులో టికెట్ల పేరుతో భారీ మోసానికి దిగారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కల్యాణం పేరిట ప్రచారంతో భారీ దోపిడీకి స్కెచ్‌ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. భద్రాచలం ఆలయ పండితులు పాల్గొంటారని చెప్పి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ క్రమంలో నిర్వాహకుడు దుర్గా ప్రసాద్‌ భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అలాంటిదేం లేదంటూ నిర్వాహకులు మీడియా ముఖంగా ఓ ప్రకటన చేశారు. మరోవైపు.. సాక్షి సహా పలు మీడియా సంస్థలు అయోధ్య సెట్‌ నిర్వాహకుల కమర్షియల్‌ బాగోతాలను వరుస కథనాలతో బయటపెట్టింది. అదే సమయంలో.. ఫ్లెక్స్ యజమానితో మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ కావడంతో మొత్తం నిర్వాకం బయటపడింది. 

మీడియా కథనాలు, తీవ్ర విమర్శల నేపథ్యంలో​ అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్‌, భద్రాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కదిలారు.  కేవలం.. ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసమే భద్రాచలం పేరును నిర్వాహకులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 35 కింద విశాఖ త్రీ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నిర్వాహకులు సెట్‌ను మూసేసి.. సర్దుకుంటున్నారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)