Breaking News

కడవకుదురు టు తెలంగాణ

Published on Sun, 08/11/2024 - 05:51

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నుంచి వేల టన్నుల ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోంది. రాత్రి 10  నుంచి తెల్ల­వా­రు­జాము­న 4 గంటల వరకు రెవెన్యూ, అటవీభూముల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తు­న్నారు. ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్ట­ర్లలో నింపుతున్నారు. ట్రక్కులన్నీ హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. టిప్పర్లు, ట్రాక్టర్లు ప్రకాశం, పల్నాడు జిల్లాలకు వెళ్తున్నాయి. పర్చూరుకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్న విమర్శలు ఉన్నాయి. 

ఈ నేతకు అవసరమైనప్పుడు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చే ఒక కంపెనీ అధినేత సమీప బంధువులు ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇసుక తవ్వకాల ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని పెట్టి కర్రలు, రాడ్లు తదితర మారణా­యుధా­లతో కాపు కాస్తున్నారు. ఎవరైనా వస్తే దాడులు చేసేందుకు వారు వెనుకాడడంలేదు. పోలీ­సు­లకు మామూళ్లు వెళ్తుండటంతో వారు ఇటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు వస్తున్నాయి.

కడవకుదురు భూముల నుంచి..
పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక (గుట్టలు) భూములు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు భూములతోపాటు రెవెన్యూ, అటవీ శాఖ భూము­లూ ఉన్నాయి. ఈ భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు గతంలో పట్టాలు ఇచ్చినా వ్యవసా­యానికి పనికిరాకపోవడంతో  బీళ్లుగానే ఉంచారు. ఇక్కడ నిర్మాణాలకు పనికొచ్చే నాణ్యమైన ఇసుక ఉండడం, వర్షాకాలం నేపథ్యంలో ఇసుకకు డిమాండ్‌ పెరగడంతో  పర్చూరు అధికారపార్టీ నేత కన్ను పడింది. 

అనుచరులనుపెట్టి ఇసుక గుట్టలను అక్ర­మంగా తరలించి రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. కడవకుదురు రైల్వే గేటు ప్రాంతంలో గత పది రోజులుగా తవ్వకాలు మొదలు పెట్టారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో పగటిపూట కాకుండా రాత్రి 10 గంటల ప్రాంతంలో జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ట్రక్కులు, టిప్ప­ర్లు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుక రూ. 4 నుంచి 8 వేలకు అమ్ముతున్నారు. 

ట్రక్కు ఇసుక రూ. 80 వేలు..
కృష్ణా, గోదావరి నదులకు నీళ్లు రావడంతో మైదాన ప్రాంతాల ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. హైదరా­బాద్‌లో ఇసుకకు మరింత డిమాండ్‌ ఉంది. దీంతో కడవకుదురు నుంచి రోజూ 15 ట్రక్కుల్లో హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తు­న్నా­రు. ఒక్క ట్రక్కు (18 టన్నులు) ఇసుక రూ. 80 వేలకు తగ్గకుండా అమ్ముతున్నట్లు తెలుస్తోంది.  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)