Breaking News

శ్రీశైలం ఘాట్ రోడ్డు.. విరిగిపడిన కొండచరియలు

Published on Wed, 10/29/2025 - 10:51

సాక్షి, శ్రీశైలం: ఏపీలో మోంథా తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షాలతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన భారీ కొండచరియలు పడ్డాయి. దీంతో, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మోంథా తుపాను ప్రభావంతో శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జేసీబీ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించడంతో భవనం కోతకు గురైంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. పాతాళగంగ (Paathal Ganga)కు వెళ్లే దారిలో కొండచరియలు విరిగిపడ్డియాయి. ఈ దుర్ఘటనలో మొత్తం మూడు షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను అటువైపు వెళ్లేందుకు అనుమతించడం లేదు. పుష్కరిణికి వెళ్లే మార్గం పూర్తిగా శిథిలాలతో మూసుకుపోగా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు టూరిజం శాఖ ఆధ్వర్యలోని రోప్‌ వే (Rope Way) సర్వీసును కూడా తాత్కాలికంగా మూసివేశారు.

తుపాను ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు నగరం సహా కొత్తపల్లి, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. మహానంది మండలం నందిపల్లి వద్ద పాలేరు వాగు వంతెన‌పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొత్తపల్లి మండలంలో శివపురం పెద్దవాగు పొంగిపోర్లుతుండటంతో సమారు 11 గ్రామాల రాకపోకలకు అంతరాయం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)