Breaking News

రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్‌

Published on Fri, 04/04/2025 - 05:34

కూటమి ప్రభుత్వం వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ మందగమనంతో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. రాబడిని పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరకు భూముల విలువలను భారీగా పెంచినా ఫలితం  లేకుండా పోయింది. 2024–25 ఆర్థిక సంవత్సరం నికర ఆదాయం రూ.8,800 కోట్లు మాత్రమే. గత ఏడాది (2023–24) రాబడి రూ.9,600 కోట్లుగా ఉంది.

 అంటే, ఈసారి రూ.800 కోట్ల మేర తగ్గిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయాలు పడిపోయాయి. చంద్రబాబు రాకతో ఉన్న కాస్త రియల్‌ బూమ్‌ మరింత పడిపోయిందని రియల్టర్లు వాపోతున్నారు. వారి మాటలు నిజమని రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తేల్చింది.

ప్రజల్ని బాదినా పెరగని ఆదాయం
నిజానికి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.13,500 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్‌ విధించింది. కానీ, వచ్చింది రూ.8,800 కోట్లు మాత్రమే. సాధారణంగా గత ఏడాది వచ్చిన నికర ఆదాయాన్ని బట్టి ఈ ఏడాది టార్గెట్‌ నిర్ణయిస్తారు. దాని ప్రకారమే ఈ ఏడాది రూ.13,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, గత ఏడాది వచ్చినంత కూడా రాకపోవడాన్ని బట్టి సిర్థాస్తి విక్రయాలు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రజల ఆదాయం తగ్గిపోవడంతో..
ప్రజల ఆదాయ మార్గాలు పడిపోవడంతో స్థిరాస్తి లావాదేవీలు పెద్దగా జరగడం లేదు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు క్యూ కడుతున్నాయంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే ప్రచారమంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని స్తిరాస్థి లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. వాళ్లు చెప్పే మాటల్లో కొంతైనా నిజం ఉంటే స్తిరాస్థి లావాదేవీలు పెరగాలి.  లేదా కనీసం గతంలో జరిగినట్లయినా జరగాలి. కానీ గతం 
కంటే తగ్గిపోయాయి. దీన్నిబట్టి మార్కెట్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల చేతుల్లో డబ్బులు లేవని తెలుస్తోంది.

భూముల విలువ పెంపుతోనే..
రూ.8,800 కోట్ల రాబడి అయినా వచ్చిందంటే.. దానికి భూముల విలువ పెంపు కారణంగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువను 40 నుంచి 50 శాతం మేర పెంచారు. దీంతో ఆదాయంలో కొంత తేడా వచ్చింది.  ప్రజలపై ఆ భారం కూడా మోపకపోతే రూ.8 వేల కోట్లను కూడా అందుకోలేకపోయేవా­రమని అధికారులు చెబుతున్నారు.

తగ్గిన 2 లక్షల డాక్యుమెంట్లు
డాక్యుమెంట్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. 2023–24లో 22.5 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అవగా.. ఈ ఏడాది వాటి సంఖ్య 20.20 లక్షలు మాత్రమే. అంటే 2 లక్షల మేర తగ్గిపోయాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా ఉండేది. 2022లో 25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్టర్‌ అయ్యాయి. చంద్రబాబు హయాంలో రూ.5 వేల కోట్ల లోపున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.10 వేల కోట్ల దగ్గరకు చేరింది వైఎస్‌ జగన్‌ హయాంలోనే. ఇప్పుడు దానిని చేరుకోలేక చంద్రబాబు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది.



నేటి నుంచి రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌
సాక్షి, అమరావతి: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ విధానం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకానుంది.  రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెలగపూడిలోని సచి­వా­లయం నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో రాష్ట్రంలోని 26 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. తర్వాత కాలంలో రాష్ట్రంలోని మొత్తం 296 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలను విస్తరించనున్నారు. 

అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ మాడ్యూల్‌ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు నిర్ధేశించిన సమయానికి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా సౌకర్యం కల్పించారు. కాగా ఇప్పటికే విజయవాడలోని గాంధీనగర్, కంకిపాడు సబ్‌ రిజి­స్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో అన్ని జిల్లాల ప్రధాన కా­ర్యాలయాల్లో అమల్లోకి అమలుచేస్తున్నట్లు మంత్రి కార్యాలయం వివరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)