Breaking News

చేటు చేసే మీడియా అది

Published on Fri, 12/01/2023 - 03:05

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): రాష్ట్రంలో ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం ప్రజలకు చేటు చేస్తుందని ఏపీ సంస్కృత అకాడమి చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజలకు ఎంతగా మేలు చేస్తున్నా, ఎల్లో మీడియా ప్రభుత్వంపై అసత్య కథనాలతో పాఠకులను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని పెన్షనర్స్‌ భవన్‌లో ‘తెలుగు మీడియా గమనం–గమ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ 1994లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన అల్లుడు చంద్ర­బాబుకు అధికారాన్ని కట్టబెట్టడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరికొన్ని పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు, వినూత్న విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నా, ఈ పత్రికలు విషం కక్కుతున్నాయని తెలిపారు.

గత చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయకపోయినా అద్భుతంగా చేశారని హడావుడి చేశాయన్నా­రు. కేవలం ఒక వ్యక్తిని, పార్టీని నిలబెట్టే తాపత్రయంతో దాదాపు 10 మీడియా సంస్థలు తీవ్రంగా పని­చేస్తున్నాయన్నారు. ఈ మీడియా కుయుక్తులను తిప్పి­కొట్టాలని ఇతర పత్రికలకు ఆమె పిలుపునిచ్చారు. 

ఆ మీడియా తీరు దారుణం :  వీవీఆర్‌ కృష్ణంరాజు 
ఏపీ ఎడిటర్స్‌ అసోసియేష¯న్‌ అధ్యక్షుడు వి.వి.ఆర్‌.కృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు మీడియాలోని ఒక వర్గం తీరు అత్యంత దారుణంగా,  రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ఈ మీడియా సమాచార కాలుష్యాన్ని ఏపీ అంతటా వెదజల్లి, ప్రజల ఆలోచనలను కలుíÙతం చేస్తోందని చెప్పా­రు.  ఏపీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుండగా, చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకంజలో ఉందని అసత్య ప్రచారం చేస్తోందని వాపోయారు. 

ఆ మీడియాకు చెదలు పట్టింది:న్యాయవాది సుందరరామశర్మ 
సీనియర్‌ న్యాయవాది చుండూరు సుందరరామశర్మ మాట్లాడుతూ ఒక వర్గం మీడియాకు చెదలు పట్టాయని అన్నారు. పత్రికలు ప్రభుత్వాలకు వారధిలా ఉండాలని అన్నారు. కానీ కొందరికి కావాల్సిన విధంగా పత్రికలు నడుస్తున్నాయని చెప్పారు. గతంలో తప్పు చేస్తే ఎత్తిచూపడం, మంచి చేస్తే పట్టం కట్టేవారని చెప్పారు. ఈనాడు వచి్చన దగ్గర నుంచి జర్నలిజంలో విలువలు తగ్గాయని ఆరోపించారు. సాక్షి పేపర్‌ రాకపోతే నాణానికి రెండో వైపు కనిపించేదికాదని అన్నారు. తెలుగు మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 దుష్టచతుష్టయమని అన్నారు. ఈ మీడియా వైరస్‌కు ప్రజలు దూరంగా ఉండాలని చెప్పారు. 

ప్రజలు చైతన్యం కావాలి :ఆచార్య డీఏఆర్‌ సుబ్రమణ్యం 
నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్‌ ఫోరం చైర్మన్‌ ఆచార్య డీఏఆర్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ వాస్తవానికి తెలుగు మీడియా, దేశీయా మీడియా ఒకేలా ఉన్నాయని, ఒకరికే కొమ్ముకాస్తున్నాయని అన్నారు. ప్రజల్లోకి ఏం సమాచారం తీసుకెళ్లాలనేది వారే నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులై అబద్దాలు, తప్పులు ఎక్కడున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకపోతే అసత్య కథనాల ఒరవడి ఆగదని అన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)