లోకాయుక్త బిల్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నం

Published on Sat, 11/23/2024 - 05:24

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్‌ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. 

బిల్లులో సవరణలపై లోకేశ్‌ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక  కమిటీలో సీఎం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్‌ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమా­వేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా. 

బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్‌ చేయమని అడగొచ్చు. 

మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్‌ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.

ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..
లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్‌ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయ­డంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజా­స్వామ్య­యుతంగానే లోకా­యుక్త­ను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్‌ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగ­ణనలోకి తీసుకునే నిర్ణయం తీసు­కున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజు­వాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్‌ ప్రకటించారు.

మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్‌ ప్రివ్యూకు రద్దు
ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్‌ గ్రాబింగ్‌ సవరణ బిల్లు, పీడీ యాక్ట్‌ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్‌ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్‌ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)