Breaking News

ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ

Published on Wed, 11/12/2025 - 06:11

సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున నిలిచినట్లు లేబర్‌ ఫోర్స్‌ సర్వే తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈమేరకు ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగిత గణాంకాలతో నివేదిక విడుదల చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానంటూ మాట మార్చేశారు! దీంతో రాష్ట్రంలో ఉపాధి లభించక నిరుద్యో­గిత పెరిగిపోతోంది. ఇదే విషయం లేబర్‌ ఫోర్స్‌ సర్వే వెల్లడించింది.

⇒ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడి అన్ని వయసుల వారికి సంబంధించి నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్‌ 8.2 శాతంతో రెండో స్థానంలో ఉంది. అదే జాతీయ సగటు నిరుద్యోగత 5.2 శాతంగా మాత్రమే ఉంది. జాతీయ సగటును మించి ఏపీలో నిరుద్యోగత నమోదైంది. అత్యధికంగా 8.9 శాతం నిరుద్యోగంతో ఉత్తరాఖండ్‌ తొలి స్థానంలో ఉంది.

⇒ గ్రామీణ, పట్టణప్రాంతాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల్లో నిరుద్యోగత 7.2 శాతం ఉండగా మహిళల్లో 10.1 శాతంగా ఉంది. అదే జాతీయ సగటు చూస్తే 5.2 శాతంగా 
నమోదైంది.

⇒ రాష్ట్రంలో పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా 8.5 శాతం నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 7.7 శాతం నిరుద్యోగత ఉందని నివేదిక తెలిపింది.

⇒ ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత 7.3 శాతం ఉండగా, మహిళల్లో 10.5 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత 7.0 శాతం ఉండగా, మహిళల్లో నిరుద్యోగత 9.3 శాతం ఉందని నివేదిక పేర్కొంది.

యువత నిరుద్యోగత 21 శాతం
ప్రత్యేకంగా యువతీ యువకుల నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో 29 ఏళ్ల లోపు వయసున్న యువతి యువకుల నిరుద్యోగత 21.0 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిని మించి ఏపీలో నిరుద్యోగత నమోదైంది. జాతీయ స్థాయిలో యువతీ యువకుల్లో నిరుద్యోగత 14.8 శాతం మాత్రమే ఉంది. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 21.9 శాతం నిరుద్యోగత ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో 19.7 శాతం, మహిళల్లో 28.8 శాతం నిరుద్యోగత ఉందని నివేదిక తెలిపింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)