Breaking News

రాజకీయ దురుద్దేశాలతోనే కేవీ రావు తప్పుడు ఫిర్యాదు

Published on Tue, 12/31/2024 - 05:15

సాక్షి, అమరావతి: కాకినాడ డీప్‌ సీ వాటర్‌ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్నాటి వెంకటేశ్వ­ర­రావు (కేవీ రావు) రాజకీయ దురుద్దేశాలతోనే తనపై సీఐడీకి ఫిర్యాదు చేశారని వైవీ విక్రాంత్‌రెడ్డి హైకోర్టుకి నివేదించారు. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టి, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణను తోసిపుచ్చుతున్నట్టు విక్రాంత్‌రెడ్డి తెలిపారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీయాలన్న అజెండాతోనే కేవీ రావు నాపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న లీగల్‌ ప్రొసీడింగ్స్‌ ద్వారా అనుచిత లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే అలా చేశారు. నాపై చేసిన ఏ ఒక్క ఆరోపణకు కూడా ఆధారం చూపలేదు. తద్వారా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఈ కేసులో నిర్ణయం వెలువరించేందుకు అత్యావశ్యకమైన పలు కీలక విషయాలను ఆయన తొక్కిపెట్టారు. వాటాల బదిలీ జరిగిన నాలుగేళ్ల తరువాత సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ఆయన ఎక్కడా చెప్పలేదు. వాటాల బదిలీ ప్రక్రియలో, మూల్యాంకనంలో, ఒప్పందాల తయారీలో కేవీ రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంతో నాకున్న రాజకీయ సంబంధాల దృష్ట్యా నా ప్రతిష్టను దెబ్బతీయడానికే రాజకీయ దురుద్దేశాలతో ఆయన ఫిర్యాదు చేశారు. కేవీ రావు తన స్వీయ చర్యల నుంచి దృష్టిని మరల్చేందుకే, తన తప్పులను కప్పించుకునేందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. తను బాధితుడినంటూ చెప్పుకుంటున్న కేవీరావు అందుకు ప్రాథమిక ఆధారాలను చూపడంలో విఫలమయ్యారు. న్యాయ సలహాదారులు, ఆడిటర్ల సమక్షంలోనే వాటాల బదిలీ జరిగింది’ అని విక్రాంత్‌రెడ్డి వివరించారు. ఈ విషయా­లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ముందస్తు బెయిల్‌ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించాలని కోర్టును కోరారు. ఈ అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయదలచుకుంటే చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేయడంతో విక్రాంత్‌రెడ్డి తన వాదన వినిపిస్తూ సోమవారం ఈ మేరకు కౌంటర్‌ దాఖలు చేశారు. విక్రాంత్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)