Breaking News

స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో మళ్లీ కూటమి కుట్ర

Published on Sun, 08/18/2024 - 05:49

సాక్షి, అమరావతి/నెల్లూరు సిటీ/కొనకనమిట్ల: ప్రశాంతంగా జరగాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు టీడీపీతోపాటు కూటమి నాయకులు రాజకీయరంగు పులిమారు. ఈ నెల 8వ తేదీన 40,150 పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆ రోజు 631 స్కూళ్లలో గ్రామస్థాయి కూటమి నాయకులు గొడవలకు దిగారు. దీంతో కోరం లేక 631 స్కూళ్లలో ఎన్నికలు నిలిచిపోయాయి. 

ఆ ఎన్నికల్ని విద్యాశాఖ అధికారులు శనివారం నిర్వహించగా.. కూటమి నేతలు మళ్లీ పాత పరిస్థితినే తీసుకొచ్చారు. పలుచోట్ల ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిన తల్లిదండ్రులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులన్న నెపంతో మళ్లీ ఎన్నికలు నిలిపేసేందుకు యత్నించారు. పలుచోట్ల దళిత తల్లిదండ్రులపై దాడులు చేశారు. 

కొన్నిచోట్ల తమకు బలం లేదన్న అక్కసుతో ఎన్నికల్ని నిలిపేయించారు. టీడీపీ నాయకుల అరాచకాలతో కొన్నిచోట్ల పేరెంట్స్‌ తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి నాయకుల కుట్రలకు కొన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు సైతం వత్తాసు పలకడం గమనార్హం. మొత్తంమీద టీడీపీ నేతల కుట్రలతో 282 పాఠశాలల్లో కమిటీ ఎన్నికలు నిలిచిపోయాయి.  

దళితులపై దౌర్జన్యం 
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గొల్లకందుకూరు పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలను టీడీపీ నేతలు మరోసారి వాయిదా వేయించారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ వర్గానికి 15 ఓట్లు ఉండగా, టీడీపీ వర్గానికి 6 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయంతో టీడీపీ నేతలు స్థానిక దళితులైన ఇద్దరు పేరెంట్స్‌ను భయభ్రాంతుల్ని చేశారు. దళితుడైన నారాయణ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తుండటంతో దాడిచేశారు. ఎన్నికల్లో పాల్గొంటే అంతు చూస్తామని బెదిరించారు. మరో దళితుడు వెంకటరమణయ్యను రాకుండా అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో ఎంఈవో ఎన్నికలను మరోసారి వాయిదా వేశారు. టీడీపీ వర్గీయుల అరాచకాలను నిరసిస్తూ 13 మంది పేరెంట్స్‌ తమ పిల్లలను మరో పాఠశాలలో చేర్చాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని కాట్రగుంట పంచాయతీ పేరారెడ్డిపల్లి యూపీ పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. 

ఎన్నికల్ని ఆపాలని టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతోపాటు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే కమిటీ సభ్యులుగా ఎన్నికవడంతో ఉక్రోషం పట్టలేని టీడీపీ కార్యకర్త కె.బసవయ్య పాఠశాల సభ్యులున్న గదిలోకి వెళ్లి టేబుల్‌పై ఉన్న పేపర్లు చించి బయటవేశాడు. 

99.38 శాతం ఎన్నికలు పూర్తి  ఎస్పీడీ శ్రీనివాసులు 
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 99.38 శాతం పాఠశాలల్లో పూర్తయ్యాయని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జీరో ఎన్‌రోల్‌మెంట్, పాఠశాలల మూసివేత, కోరం లేకపోవడం వంటి కారణాలతో 282 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)