Breaking News

కర్నూలు కిమ్స్ వైద్యుల అరుదైన చికిత్స.. యువతికి రిలీఫ్‌

Published on Mon, 11/03/2025 - 13:50

కర్నూలు, సాక్షి: గ‌ర్భాశ‌యంలో ఫైబ్రాయిడ్ ఏర్ప‌డ‌డంతో పాతికేళ్ల వ‌య‌సులోనే బేతంచ‌ర్ల‌కు చెందిన ఓ యువ‌తికి హిస్ట‌రెక్ట‌మీ (గ‌ర్బాశ‌య తొల‌గింపు) శ‌స్త్రచికిత్స చేయాల్సి వ‌చ్చింది. ఫైబ్రాయిడ్ కార‌ణంగా ఆమెకు త‌ర‌చు ర‌క్త‌స్రావం అవుతుండ‌టంతో ఆ శ‌స్త్రచికిత్స త‌ప్ప‌లేదు. అప్ప‌టికే పెళ్ల‌య్యి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉండ‌డంతో దానికి కుటుంబ‌స‌భ్యులు కూడా అంగీకారం తెలిపారు. 

అయితే, హిస్ట‌రెక్ట‌మీ చేసిన త‌ర్వాత ఆమెకు త‌ర‌చు మూత్రం లీక్ అవ్వ‌డం మొద‌లైంది. దీనివ‌ల్ల ఆమె ఎక్క‌డ‌కూ బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోవ‌డం, త‌ర‌చు దుర్వాస‌న‌తో శారీర‌కంగా, మాన‌సికంగా తీవ్ర ఇబ్బంది ప‌డ్డారు. ఎట్ట‌కేల‌కు రెండు నెల‌ల త‌ర్వాత క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో యూరాల‌జీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ వై.మ‌నోజ్ కుమార్ ఆమెకు ఒక సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేసి, పూర్తి ఊర‌ట క‌ల్పించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న తెలిపారు.

“నంద్యాల జిల్లా బేతంచ‌ర్ల‌కు చెందిన పాతికేళ్ల యువ‌తికి త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో హిస్ట‌రెక్ట‌మీ చేయాల్సి వ‌చ్చింది. అయితే, ఆ త‌ర్వాతి నుంచి ఆమెకు మూత్రం లీక్ అవుతుండ‌డంతో మా వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఇక్క‌డ ఆమెకు సీటీ సిస్టోగ్ర‌ఫీ లాంటి కొన్ని ప‌రీక్ష‌లు చేస్తే.. ఆమెకు మూడు వెసికోవెజైన‌ల్ ఫిస్టులాలు ఏర్ప‌డ్డాయ‌ని తెలిసింది. ఇవి మూత్ర‌కోశానికి, యోనికి మ‌ధ్య‌న ఏర్ప‌డ‌తాయి. శ‌స్త్రచికిత్స కార‌ణంగా ఏర్ప‌డిన ఈ ఫిస్టులాల వ‌ల్లే ఆమెకు మూత్రం లీక్ అయ్యే స‌మ‌స్య త‌లెత్తింది.  ఇలా జ‌ర‌గడం వ‌ల్ల రోగులు స‌మాజానికి, త‌మ కుటుంబ‌స‌భ్యులకు కూడా దూరమై, క్ర‌మంగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. బ‌య‌ట‌కు రావ‌డానికి ఇబ్బంది ప‌డ‌తారు.

ఈ కేసు సంక్లిష్ట‌మైన‌ది. ఎందుకంటే మూడింటిలో ఒక ఫిస్టులా మూత్ర‌నాళానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంది. అందువ‌ల్ల దాని మ‌ర‌మ్మ‌తును అత్యంత జాగ్ర‌త్త‌గా, క‌చ్చిత‌త్వంతో చేయాల్సి ఉంటుంది. దానికితోడు మొద‌టి శ‌స్త్రచికిత్స జ‌రిగిన త‌ర్వాత క‌ణ‌జాలాలు స్థిర‌ప‌డేందుకు క‌నీసం మూడు నెల‌లు ఆగాల్సి ఉంటుంది. వాళ్లు రెండు నెల‌ల త‌ర్వాత మా వ‌ద్ద‌కు వ‌చ్చారు. దాంతో మ‌రో నెల‌రోజులు ఆగ‌మ‌ని చెప్పి, ఆ త‌ర్వాత శ‌స్త్రచికిత్స చేప‌ట్టాం. ఈ శస్త్రచికిత్సలో మూత్రాశయాన్ని, యోనిని వేరు చేసి, దెబ్బతిన్న భాగాలను శుభ్రపరచి, కొత్త పొరలతో పునర్నిర్మాణం చేశాం. అత్యంత క‌చ్చితత్వం, జాగ్ర‌త్త‌ల‌తో మూడు ఫిస్టులాల‌నూ మూసేశాం.  శ‌స్త్రచికిత్స త‌ర్వాత రోగి బాగా కోలుకున్నారు. మొత్తం క్యాథెట‌ర్లు, ట్యూబులు కూడా తీసేసి ఆమెను డిశ్చార్జి చేశాం. ఇప్పుడు మూత్రం లీకేజి లేక‌పోవ‌డంతో ఆమెకు పూర్తి ఆత్మ‌విశ్వాసం వ‌చ్చింది. ఇంత‌కుముందు కంటే ఎంతో సంతోషంగా ఉన్నారు.

వెసికో వెజైనల్ ఫిస్టులా అనేది మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే సమస్య. ఇది కేవలం శారీరక సమస్య కాదు, సామాజిక అవరోధం కూడా. సమయానికి గుర్తించి సరైన చికిత్స చేస్తే పూర్తిగా నయం అవుతుంది. ఈ రోగి మళ్లీ సాధారణ జీవితానికి రావ‌డం మా మొత్తం బృందానికి గొప్ప సంతృప్తినిచ్చింది” అని డాక్ట‌ర్ వై. మ‌నోజ్ కుమార్ వివ‌రించారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)