తమ్ముడిని చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన అన్న..

Published on Mon, 11/17/2025 - 11:22

కుప్పంరూరల్‌ : అప్పు అడిగినందుకు తమ్ముడు అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసి ఓ ఇంట్లో పూడ్చిపెట్టిన వైనం కుప్పం పట్టణానికి సమీపంలోని జగనన్న కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కుప్పం మండలం, దళవాయికొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్‌ (37) కుటుంబం  కొద్ది సంవత్సరాల కిందట బతుకు తెరువు కోసం బెంగళూరు వెళ్లి అత్తిబెల్లి వద్ద స్థిర పడ్డారు. శ్రీనాథ్‌కు వరుసకు అన్నయ్య అయిన ప్రభాకర్‌కు ఆర్థిక లావాదేవీలు నడిచేవి. ఈ క్రమంలో ప్రభాకర్‌కు దాదాపు 40 లక్షల వరకు అప్పు ఇచ్చాడు. తీరా అప్పు తీర్చమని అడిగితే ఇదిగో... అదిగో అంటూ కాలం వెలిబుచ్చేవాడు. 

శ్రీనాథ్‌ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రభాకర్‌ ఎలాగైనా శ్రీనాథ్‌ను కడతేర్చాలని  కొంత కాలంగా కుట్ర పన్నాడు. గత 27న 10 లక్షల అప్పు తిరిగి ఇస్తానని శ్రీనాథ్‌ను నమ్మబలికిన ప్రభాకర్‌... ఒంటరిగా సెల్‌ఫోన్‌ లేకుండా కుప్పం రావాలని కోరాడు. ప్రభాకర్‌ మాటలు నమ్మని శ్రీనాథ్‌ సెల్‌ఫోన్‌ లేకుండా తలపై టోపి, ముఖానికి మాస్కు ధరించి వచ్చాడు. ప్రభాకర్, అతడి స్నేహితుడు జగీష్‌ లతో కలిసి శ్రీనాథ్‌ కుప్పం పట్టణంలోని జగనన్న కాలనీలోని ప్రభాకర్‌ ఇంటికి చేరుకున్నారు. శ్రీనాథ్‌ను అతికిరాతకంగా సుత్తితో కొట్టి అక్కడే పూడ్చిపెట్టి ఏమి తెలియనట్లు వచ్చేశాడు. శ్రీనాథ్‌ రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బెంగళూరులోని అత్తిబెలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

బెంగళూరు పోలీసులు పలుమార్లు కుప్పం వచ్చి దర్యాప్తు చేపట్టిన ఎలాంటి ఆచూకీ దొరలేదు. ప్రభాకర్‌ మాత్రం తనకేమి తెలియనట్లు దర్జాగా తిరుగుతూనే ఉన్నాడు. చివరకు శ్రీనాథ్‌ మొబైల్‌ కాల్‌ హిస్టరీ పరిశీలించగా, ప్రభాకర్‌కు పలుమార్లు ఫోన్లు చేసినట్లు  గుర్తించారు. వెంటనే ప్రభాకర్‌ను బెంగళూరు తీసుకుపోయి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తానే శ్రీనాథ్‌ను హత్య చేసి కుప్పంలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకున్నాడు.

 ఆదివారం బెంగళూరు పోలీసులు కుప్పం వారితో కలిసి శ్రీనాథ్‌  మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ఇంటి నుంచి శవాన్ని బయటకు తీశారు. శ్రీనాథ్‌ కుటుంబ సభ్యుల రోదనలతో జగనన్న కాలనీ దుఃఖసాగరంలో నిండింది. కాగా ప్రభాకర్‌ శ్రీనాథ్‌కు స్వయన పెద్దనాన్న కొడుకు. అన్నయ్య అవుతాడని స్థానికులు చెప్పారు. ప్రభాకర్‌ ఇప్పటికే ఓ హత్య కేసులో జీవిత కాలం శిక్ష అనుభవించి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.

 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)