Breaking News

నెల్లూరులో కుబేర సినిమా తరహా స్కామ్‌

Published on Sun, 07/20/2025 - 11:58

ధనుష్‌ నటించిన తెలుగు సినిమా ‘కుబేర’.. థియేటర్‌ నుంచి ఇప్పడు ఓటీటీకి వచ్చి అలరిస్తోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు కూడా పాల్పడతారని చూపించారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. అయితే ఈ సినిమా కథాంశం తరహాలోనే నెల్లూరులో ఓ భారీ కుంభకోణం ఇప్పుడు బయటపడింది.

సాక్షి, నెల్లూరు: కుబేర సినిమా తరహాలో జిల్లా కేంద్రంలో బయటపడిన ఓ భారీ స్కామ్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10 కోట్ల 60 లక్షల మేర సొమ్మును కేటుగాళ్లు మాయ చేశారు. ఇందుకోసం అమాయక గిరిజనుల ఐడెంటిటీని వాడుకున్నారు.

ఓ ఫేక్‌ కంపెనీని ఏర్పాటు చేసి.. అందులో కొందరు గిరిజనులను ఉద్యోగులుగా చూపించారు. వాళ్లకు ఆరు నెలలపాటు జీతాలు ఇచ్చినట్లు స్టేట్‌మెంట్లు క్రియేట్‌ చేశారు. అలా మొత్తం 56 మంది పేరిట నెల్లూరు యాక్సిస్‌ బ్రాంచ్‌లో లోన్లకు అప్లై చేసి డబ్బు చేజిక్కించుకున్నారు.  అయితే.. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో గిరిజనులకు నోటీసులు వెళ్లాయి. దీంతో వాళ్లు లబోదిబోమన్నారు. 

2022  నుంచి సుమారు రెండేళ్లపాటు ఈ భారీ స్కామ్‌ జరిగినట్లు తేలింది. కిందటి ఏడాది సదరు బ్రాంచ్‌ మేనేజర్‌ ముగ్గురు వ్యక్తుల మీద ముత్తుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ స్కాంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)