Breaking News

గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక

Published on Tue, 08/04/2026 - 05:25

సాక్షి, అమరావతి: ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ కనీస నీటి మట్టాన్ని దాటింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,49,917 క్యూసెక్కులు చేరగా, నీటి నిల్వ 855.1 అడుగులలో 92.04 టీఎంసీలకు చేరుకుంది. 

 ⇒ శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. అయినప్పటికీ అటు హంద్రీ–నీవా, ఇటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేదు. 

⇒ ప్రాజెక్టులో ఎడమ వైపు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు 1,600 క్యూసెక్కుల చొప్పున గత నెల 25 నుంచి (ఆ రోజున 41.46 టీఎంసీలు నిల్వ) తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తూ– ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు నీటిని సరఫరా చేస్తోంది. 
⇒ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలు.. కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందిస్తోంది. 
⇒ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటికీ ఇబ్బందులున్నప్పటికీ... హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు చంద్రబాబు సర్కార్‌ నీటిని విడుదల చేయకపోవడంపై రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ఆల్మట్టిలోకి పెరిగిన వరద..
⇒  మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన సోమవారం వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కులు చేరుతుండగా..స్పిల్‌ వే, విద్యుత్‌ కేంద్రాల ద్వారా 1,28,417 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 
⇒ నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 1,28,954 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌ కేంద్రాల ద్వారా 1,23,364 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 
⇒ ఎగువ నుంచి వస్తున్న వరదను చూస్తే మరో మూడు రోజులు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో నీటి ప్రవాహం కొనసాగనుంది.    

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)